కేరళలో నరబలి.. ప్రధాన కుట్రదారు షఫీ మాయలో ఇంకెంతమంది ఉన్నారో..?

0
1013

మంత్రగాడి మాటలు నమ్మిన దంపతులు ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. వారిని ముక్కలుగా నరికి, రక్తం తమ ఇంటి గోడలు, నేలపై చల్లారు. శవాలను తమ పెరటి ఆవరణలో పాతి పెట్టారు. ఈ కేసులో కేరళలోని పతనమిట్టలో తిరువళ్లకు చెందిన నాటు వైద్యుడు భగావల్ సింగ్, అతని భార్య లైలా, వాళ్లకు సహకరించిన మంత్రగాడు మొహమ్మద్ షఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు అపహరించి హత్య చేసిన మహిళలను లాటరీ టికెట్లు అమ్ముకునే రోసలిన్, పద్మగా గుర్తించారు. భగావల్ సింగ్ దంపతులు కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఫేస్ బుక్ ద్వారా షఫీ సంప్రదించారు. నరబలి ఇచ్చి పూజలు చేస్తే సంపద కలుగుతుందని అతను సలహా ఇచ్చాడు. షఫీ సాయంతో జూన్ లో రోసలిన్ ను కిడ్నాప్ చేసి తీసుకొని నరబలి ఇచ్చారు. నెలలు గడుస్తున్నా తమ పరిస్థితి మారకపోవడంతో భగావల్ సింగ్ దంపతులు షఫీని సంప్రదిస్తే మరో నరబలి ఇవ్వాలని అతను సూచించాడు. ఈ క్రమంలో గత నెల 26న పద్మను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆమెను దారుణంగా హత్య చేశారు. సీసీ టీవీ ఫుటేజ్, పద్మ, రోసలిన్ సెల్ ఫోన్స్ లెకేషన్ ఆధారంగా షఫీని అరెస్టు చేశాడు. అతనిచ్చిన సమాచారంతో భగావల్ దంపతులను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా పద్మతో పాటు రోసలిన్ ను కూడా నరబలి ఇచ్చినట్టు ఒప్పుకున్నారు.

ఈ దారుణంపై కొచ్చి పోలీస్ కమిషనర్ స్పందించారు. హత్యకు గురైన ఇద్దరు మహిళల మృతదేహాలకు సంబంధించిన అన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నాం. బాధిత మహిళల్లో ఒకరి మృతదేహాన్ని పాతిపెట్టిన మూడు గుంటలలోనే స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రధాన నిందితుడు షఫీ ఇంకా ఎంత మందిని నమ్మించాడో అని.. దర్యాప్తు చేస్తున్నామని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. షఫీ ప్రధాన కుట్రదారని దర్యాప్తులో మాకు తెలిసిందని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్ నాగరాజు తెలిపారు.