డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐ.పోలవరం మండలం జి. మూలపాలెం-గొల్లగరువు గోదావరి రేవు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గోదావరిలో సూడి ఎక్కువగా ఉండటంతో చెట్టును ఢీకొని పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలు గోదావరి నదిలో పడిపోయాయి. ప్రమాద సమయంలో పడవలో సుమారు 10మంది ప్రయాణికులు, రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అయితే స్థానికులు ప్రయాణికులను రక్షించారు. నావలో లైఫ్ జాకెట్స్ లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.