More

    జమ్మూలోని ఉధంపూర్ లో పేలుడు.. గంటల వ్యవధిలో రెండో పేలుడు

    జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ నగరంలోని బస్ స్టాండ్‌లో ఆపి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. ఎనిమిది గంటల వ్యవధిలో ఇది రెండో పేలుడు. ఈ ఘటనల కారణంగా భద్రతా ఏజెన్సీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన పేలుడు ధాటికి బస్సు పైకప్పు, వెనుకభాగం ఎగిరిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    అక్టోబర్ 4 నుండి ప్రారంభమయ్యే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఈ సంఘటనలు జరిగాయి. ఆయన సెప్టెంబర్ 30 న జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనను ప్రారంభించి, అక్టోబర్ 1 న రాజౌరి, అక్టోబర్‌ 2 న బారాముల్లాలో బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.

    బుధవారం రాత్రి, డోమైల్ చౌక్ వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఆపి ఉంచిన ఖాళీ బస్సులో కూడా పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.. ప్రతిరోజూ బస్సును ఎప్పటిలాగే స్పాట్‌లో పార్క్ చేసేవారు. రెండవ పేలుడు సంభవించిన బస్సు ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ నుండి వచ్చి బస్టాండ్‌లో రాత్రి సమయంలో ఆగి ఉంది. ఉదయం బసంత్‌గఢ్‌కు బయలుదేరాల్సి ఉంది. పేలుళ్లలో రెండు మూడు బస్సులు దెబ్బతిన్నాయని ఉదంపూర్-రియాసి రేంజ్ డీఐజీ సులేమాన్ చౌదరి తెలిపారు. పేలుడు పదార్ధాల స్వభావం, ఇతర విషయాలను దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. గాయపడిన వ్యక్తులను విచారించామని, తీవ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు అప్రమత్తం చేయడంతో పాటు అనుమానాస్పద వస్తువుల కోసం తమ తమ వాహనాలను తనిఖీ చేయాలని ప్రజలను కోరారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాల సిబ్బంది బస్టాండ్‌ను జల్లెడ పడుతున్నారు.

    Trending Stories

    Related Stories