మనకు తెలియాల్సిన మదర్ థెరీసా చీకటి కోణం

1
1235

మదర్ థెరిస్సా అసలు పేరు.. ఆగ్నిస్ గోక్షా భోజాక్షు

ఆల్బేనియా దేశానికి చెందిన రోమన్ కేథలిక్ సన్యాసిని. భారత దేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీ ని కోల్ కతా లో స్థాపించింది. పేదవాళ్లకు, రోగాలతో ఉన్న వాళ్లకి, అనాధలకి, సావు బతుకుల మధ్య పోరాడుతున్న వాళ్లకి అనేక సేవలు చేసింది.

ఈమె తాను చేసిన మానవ సేవకి గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నని పొందింది.

ఇదంతా ఆన్ స్క్రీన్.. మనం పుస్తకాల్లో చదివింది, మనకి మన చరిత్ర నేర్పించింది

కొంచెం సేపు మన చరిత్ర ని పక్కన బెట్టి వాస్తవంలోకి పోయి అసలు నిజాలేంటో చూద్దం.

ప్రేమకు మారు రూపం మదర్ థెరిస్సా

సేవకి మరో రూపం కూడా మదర్ థెరిస్సానే

తాను చనిపోయే లోపు  500 మిషనరీస్ ని 100 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో స్థాపించింది.

వాస్తవానికి మదర్ థెరిస్సా ఎవరు..?

గత వంద సంవత్సరాల్లో చర్చిల చేత నియమించబడిన చాలా తెలివి కలిగిన అండ్ సక్సెస్ ఫుల్ పీ ఆర్ అండ్ మార్కెటింగ్ చేయగలిగిన వ్యక్తి.

 అమె చేసింది చారిటీ వర్క్ కదా..

వీడేంది మార్కెటింగ్ పీ ఆర్ అంటున్నాడు అని మీకనిపించొచ్చు. దానికి సమాధానం నా దగ్గర ఉంది. చారిటీ అంటే ఏంటి..?  

నువు చేసే సేవ….తిరిగి ఏదీ ఆశించకుండా అంటే ప్రతిఫలం ఆశించకుండా చేయడం…..మరి మదర్ థెరిసా అలాగే చేశారా…?

ఆమె చేసిన ఛారిటీ వర్క్ యొక్క అల్టిమేట్ గోల్ కన్వర్షన్ ……

మరి ప్రతిఫలంగా కన్వర్షన్ ని ఆశించినపుడు ఆమె చేసింది. ఉచిత సేవ లేదా చారిటీ ఎలా అవుతుంది. అది ట్రాన్సాక్షన్ అవుతుంది.  2016 లో వాటికన్ లో పోప్ ప్రాన్సిస్ చేత  సెయింట్ గా డిక్లేర్ చేయబడింది. ఆమె చేసిన , చేసింది అని చెప్పబడుతున్న మిరాకిల్ మీకు చేప్తాను. వాటి గురించి చాలా మంది డాక్టర్ లతో సహా ఇన్వస్టిగేట్ చేశిండ్రు.

భారత్ లోని ఒక స్త్రీ తాను మదర్ థెరిసాకి  ప్రే చేయగానే తనలోని ట్యూమర్  తగ్గి పోయింది అని చెప్పింది. డాక్టర్ రంజన్ ముస్తాఫీ అనే డాక్టర్ ఆమెను పరిశీలించి తాను వాడిన ప్రిస్క్రిప్సన్ ద్వారా మాత్రమే క్యాన్సర్ తిత్తి తగ్గిందని, దాంట్లో ఏ మిరాకిల్స్ లేవని ఆయన చెప్పారు. ఈ వాటికన్ వాళ్లు ఆ డాక్టర్ ని ఒక సారి ఇంటర్వ్యూ చేస్తే బాగుంటదేమో.

ఉమెన్ రైట్స్ పైన ఖచ్చితమైన ఒపెనియన్స్ ఉండేవి ఆమెకి…. మేన్ గా అబార్షన్స్ గురించి, అబార్షన్ అనేది  biggest destroyer of love and piece అని చెప్పే ది…. అలాగే డైవర్స్…… విడాకులు తీసుకోవడం కూడా చాలా పెద్ద నేరంగా ఆవిడ భావించేవారు. ఆడవాళ్లు తిరిగి పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అనే వారు. ఈ రెండింటికి సంబంధించి ఐర్ లాండ్ లో ఇవి ఇల్లీగల్ అనే లా ను తీసుకు రావడానికి చాలా గట్టిగా నే ట్రై చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వీటిపైన ఈవిడ క్యాంపెయినింగ్ కూడా చేశారు. కానీ ఇక్కడే ఇంకో విషయం  కూడా మనం గమనించాలి.

తన బెస్ట్ అండ్ రిచెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రిన్సెస్ డయానా విషయంలో ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకోవడాన్ని ఈవిడ సపోర్ట్ చేసింది. ఎందుకంటే డయానా కి ఈ conversions కి  పంచే నిధులకి  లింక్ ఉంది కాబట్టి.

ఇక్కడ ఇంకో పేరు గుర్తుంచుకోవాలి.  వీడియో అయిపోయాక గూగుల్ చేసి చూడండి. ఈ పేరుని  ఇంకా చాలా information మీకు అర్థమౌతుంది.  ఆయనే డాక్టర్ chaterjee …. అసలీ మిషనరీస్ వెనకాల ఏముంది. మదర్ థెరిసా అని గూగుల్ లో కొట్టగానే  ఆవిడ సేవ చేసిన ఫోటోలు, పిల్లలతో నవ్వుతూ నిలబడిన ఫోటోలు మాత్రమే మనకు కనిపిస్తాయి వాటి వెనకాల అసలు ఏముందో కనుక్కునే ప్రయత్నం చేశిర్రు….. ఆయన పుట్టి పెరిగింది కలకత్తాలో …..

ఒక కలకత్తా పౌరుడిగా ఆయనకి మదర్ థెరిసా చేసే పనుల పట్ల ఆసక్తి కలిగింది. ఒక క్యూరియాసిటీ….దాంతో దాదాపు 25 సంవత్సరాలు ఆయన INVESTIGATE  చేశాడు. పెద్ద పెద్ద డ్రగ్స్ సప్లయర్స్ నుండి , మోసగాళ్ల దగ్గరి నుండి ఆవిడ 

DONATIONS తీసుకునేవారు. ప్రతిఫలంగా యూఎస్ గవర్నమెంట్ కి అక్కడ జడ్జెస్ కి వాళ్లని శిక్షించవద్దని లెటర్స్ రాసేవారు. కోల్ కతా లో వీళ్ల చారిటీ కి అంబులెన్స్ లని బిజినెస్ మేన్స్ డొనేట్ చేసేవారు. చచ్చిపోతున్నారు అని చెప్పినా కూడా ఎట్ లీస్ట్ 200 మీటర్ల దూరంలోకి కూడా వాళ్ల ని పంపేవారు కాదు అందులోని నన్స్……

ఇదంతా డాక్టర్ ఛటర్జీ ఫోన్ కాల్ లో రికార్డు చేశారు. హాస్పిటల్స్ లో  సరైన మందులు ఉండేవి కావు. చనిపోతున్న వారిని అలా చూస్తూ ఉండేవారు కానీ ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియదు. చిన్న పిల్ల లని బెడ్స్ కి కట్టేసే వారట..

 ఈ మిషన్స్ గురించి భారత్ లో పనిచేసిన మరొక వ్యక్తి హెన్లీ గోంజలజ్….ఆయన చెప్పిన దాని ప్రకారం అక్కడ పనిచేసే వర్కర్స్ , నీడిల్స్ ని ట్యాప్ వాటర్ కింద కడిగే వారు. అండ్ వాటిని మళ్లీ యూస్ చేసేవారు. డేట్ అయిపోయిన మందులను కూడా స్టోర్ చేసి వాడేవాళ్లంట.  వాలంటరీ గా వచ్చిన వాళ్లకి ఏదో నామమాత్రంగా లేదా అసలు ట్రైనింగ్ లేకుండానే పని చేపించే వాళ్లంట….దాంట్లో చాలా పెద్ద ఫైనాన్షియల్ స్కాం జరిగేదని ఆయన చెప్పారు.

బెడ్స్ పైన చావుకి దగ్గరలో ఉన్న పేషెంట్స్ కి మదర్ థెరిసా చెప్పే వాళ్లట……. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జీసస్ మిమ్ములను కిస్ చేస్తున్నారు అనీ….. అదే తన ఆరోగ్యం సరిగా లేనప్పుడు మాత్రం ప్రపంచంలోనే బెస్ట్ మెడికల్ హెల్ప్ ని తీసుకున్నారు.

లక్షల కోట్ల డొనేషన్ లు తీసుకున్న చారిటీ లు వాళ్ల ప్రాణాలు పోతుంటే ఎందుకు మినిమమ్ మెడికల్ అసిస్టెంట్స్ ఇవ్వలేదు. పైగా మదర్ థెరిసా వారితో అనేవారంట. మీరు చచ్చిపోతారు బతకటానికి ఎటువంటి అవకాశం లేదు. అని వాళ్లలో బ్రతుకుతామన్న  కోరిక పూర్తిగా చచ్చిపోయిన తర్వాత  ఆ దేవుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు….. క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయండి… జీసస్ ని ప్రే చెయ్యండి అని చెప్పి వాళ్లతో ప్రార్థనలు చేపించే వాళ్లంట… నేను సచ్చిపోతున్న ….. ఆఖరి క్షణంలో ఉన్నాను…. బ్రతకటానికి ఎటువంటి అవకాశంలేదు అని తెలిసిన…  ఎవరైనా తమ ముందు ఏ చిన్న హోప్ కనిపించినా ట్రైచేస్తారు. వాళ్లందరూ థెరిసా చెప్పినట్టుగానే చేసేవారు. అలా చావుకు ముందు చాలా  మంది  కన్వర్ట్ అయ్యారు. ఏ రోజు కూడా ఆ చారిటీ లకు  వచ్చే డొనేషన్ లను పబ్లిష్ చెయ్యడానికి వాళ్లు ఇష్టపడేటోళ్లు కాదు. జర్మన్ మేగజైన్ స్టెర్న్ పబ్లిష్ చేసిన ఓ కథనంలో  వచ్చిన మొత్తం డొనేషన్ లల్లో కేవలం 7 పర్సెంట్ మాత్రమే చారిటీ కి యూజ్ చేస్తున్నారని చెప్పారు.

 మనం స్టార్టింగ్ లో మాట్లాడినట్లు చారిటీ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది…….. కానీ జనాలని తమ మతంలోకి కన్వర్ట్ చేయడమే లక్ష్యంగా పనిచేసిన సారీ పని చేస్తున్న ఇలాంటి వాటిని చారిటీలు అనరు.. బిజినెస్ మోడల్ అంటారు.

జర్నలిస్ట్ అండ్ ఆథర్ క్రిస్టోఫర్ హికెన్స్  ఒక డాక్యుమెంటరీ తీసాడు. 1994 లో హెల్స్ ఎంజిల్ అని ……..మదర్ థెరిసా చేసే ఈ క్రస్టియన్ కన్వర్షన్స్ అదే చారిటీ పైన…. బ్రిటీష్ టెలివిజన్ ఛానెల్ 4 లో అది టెలికాస్ట్ అయింది. 1996 లో ది గార్డియన్ అనే ఒక పత్రిక మదర్ థెరిసా ఛారిటీలో జరుగుతున్న ఆకృత్యాల గురించి కథనాన్ని వేసింది.1997 లో చాలా యూరోపియన్ టెలివిజన్స్ మదర్ థెరిసా పైన మదర్ థెరిసా టైం ఫర్ ఛేంజ్ ..?

అనే డాక్యుమెంటరీని పబ్లిష్ చేసింది. దాంట్లో ఛారిటీ చేసే మోసాలను చాలా క్లియర్ గా చూపించారు. ఇలా మదర్ థెరిసా కి మరోవైపు చాలా డాక్యుమెంటరీలు పుస్తకాల్లో ఉంది. కానీ అదంతా మనకవసరం లేదు. మనం చెప్పాలనుకుంది చెప్పేసాం. రుద్దాలి అని భావించింది రుద్దేసాం.

మన దగ్గర ఏ సినిమా అయినా డొనేషన్ అనగానే  మదర్ థెరిసా ఫౌండేషన్

ఎక్కడైనా సేవ అనగానే థెరిసా ఫోటో

చివరికి అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినా మదర్ థెరిసా నే INSPIRATION 

ఈ దేశంలో సేవ అన్న మాట వచ్చిందంటే చాలు. మదర్ థెరిసా ని కోట్ చేయకుండా ఉండలేరు.

సేవ అనే ముసుగులో మత మార్పిడే లక్ష్యంగా పనిచేసిన థెరిసా కు భారత రత్న పురస్కారం

అదే నిస్వార్థంగా  ఎందరి ఆకలో తీర్చిన డొక్క సీతమ్మ ఎవరో కూడా మనకు తెలీదు.

మత వ్యాప్తి కోసం కోట్లాది రూపాయలు విదేశాల  నుంచి గడించిన మదర్ థెరిసా మన స్టార్ హీరోలకు ఆదర్శం. కానీ ఎవరి నుంచీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా శత్రువుల ఆకలి సైతం తీర్చిన డొక్క సీతమ్మ ను మాత్రం కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం చేశాం

ఇది కదా మన దేశ దౌర్భాగ్యం

ఇక ఈ వీడియో చూసి సేవ గురించి, థెరిసా గురించి ఇలా మాట్లాడతావా అని నన్ను విమర్శించే వాళ్లకి ఒక్క మాట

నిస్వార్థ జీవనం …..సేవా భావం ఎవరో విదేశీయలు నేర్పించాల్సిన దుస్థితి నా ఈ దేశానికి లేదు.

దాన గుణం…ధాతృత్వ స్వభావం భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న ఆదర్శం…….

  

1 Comment

  1. అవును అన్నా మీరు చెప్పింధి ముమ్మా టికి సరైన అధే మన సీతమ్మ గురించి ఎ పిచ్చిగా కోడ్కి థెల్వాదు సీతమ్మ గురించి 10 వ తారగతిలో వుండే అన్నా నెన్ సాయి కృష్ణ అన్నా గారి అభిమానిని అన్నా అనాథో ఒకసరి మాట్లడలాని వంధన్న

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

five × four =