నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్ తీరు వివాదాస్పదమైంది. అయ్యప్ప దీక్షలో ఉన్న అనిల్ కుమార్ ముస్లింల టోపీ ధరించి నమాజులో పాల్గొనడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అనిల్ కుమార్ హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడంటూ బీజేవైఎం ఆయన నివాసాన్ని ముట్టడించింది. తక్షణమే ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అనిల్ అనుచరులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.