టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి

0
807

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు వచ్చిన కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలు బంజారా హిల్స్ లోని కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేశారు.

లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు రావడంతో కవిత తన పదవికి రాజీనామా చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారన్నారు.