ఈ నెల 26 నుండి ‘‘ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్ర’’ షురూ కానుంది. వచ్చే నెల 14 వరకు యాత్ర సాగనుంది. ఒక్కో పార్లమెంట్ పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు తీయనున్నారు. బైక్ ర్యాలీల వివరాలను ‘‘ప్రజా గోస–బీజేపీ భరోసా యాత్ర’’ ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గవ్యాప్తంగా 200 బైక్‌లతో 10 నుండి 15 రోజుల పాటు బైక్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.