పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. మరో భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనుమానాస్పద రీతిలో మరణించాడు. కూచ్ బెహార్ జిల్లాలోని సీతాయ్ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని అనిల్ బర్మాన్ గా గుర్తించారు. అతడి ఇంటికి దగ్గరగా ఉన్న తోటలో అతడి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో అనిల్ ను ఎంతో మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరించారని.. అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు.
టీవీ9 జర్నలిస్టు అనింద్య బెనర్జీ ట్విట్టర్ లో అనిల్ బర్మార్ మృతదేహాన్ని పోస్టు చేశారు. అతడి శవం చెట్టుకు వేళాడుతూ కనిపించింది. కూచ్ బెహార్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక ఇలా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుపుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. కొందరు బీజేపీ కార్యకర్తలను హిట్ లిస్టులో పెట్టి వారిపై తృణమూల్ గూండాలు దాడులు చేస్తూ ఉన్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ మరణానికి అనవసరంగా రాజకీయ రంగులు అద్దుతూ ఉన్నారని చెబుతున్నారు. కావాలనే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తూ ఉన్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలపై దాడులకు దిగిన తృణమూల్ కాంగ్రెస్:
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే..! అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూచ్ బెహార్ జిల్లాలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్నాయి. 300-350 సంఖ్య ఉన్న తృణమూల్ బృందం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఐఎస్ఎఫ్ బృందంపై దాడి చేసింది. ఆ సమయంలో భద్రతా బలగాలు రక్షణ కోసం కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో 4 మరణించారు. సితాల్కుచ్చి అసెంబ్లీ స్థానంలోని జోర్పట్కి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.