National

గాంధీనగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ కంప్లీట్ విక్టరీ

గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. మొత్తం 44 స్థానాలున్న గాంధీ నగర్‌ మున్సిపాలిటీలో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ రెండు స్థానాలు, ఆప్ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆదివారం పోలింగ్ జరగ్గా మంగళవారం లెక్కింపు చేపట్టారు. గాంధీనగర్ మున్సిపాలిటీలోని 11 వార్లుల్లో ఉన్న 44 స్థానాలకు 162 అభ్యర్థులు పోటీకి దిగారు.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (జిఎంసి) ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినందుకు గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్‌ను కూడా నడ్డా అభినందించారు.

గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధినేత సీఆర్ పాటిల్ మాట్లాడుతూ బీజేపీ నేతలకు ప్రజలతో క్షేత్ర స్థాయిలో ఎంతటి అనుబంధం ఉందో ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ఆప్‌ను ప్రజలు తిరస్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గుజరాత్ ప్రజలకు ఉన్న విశ్వాసం ఈ ఫలితాలతో మరోసారి రుజువైందని అన్నారు.

Related Articles

Back to top button