పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా వెలువడనే లేదు. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు , బీజేపీ కి మధ్య ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి పోలైన ఓట్లల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడానే ఉండటంతో…, కమలం పార్టీ పెద్దలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెలలో మూడు నుంచి నాలుగు రోజులపాటు పశ్చిమ బెంగాల్ టూర్ లోనే గడుపుతున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం బెంగాల్ జపమే చేస్తున్నారు. ఇక బీజేపీ బెంగాల్ ఇన్ చార్జ్ కైలాష్ విజయ వర్గీయ అయితే ఏకంగా తన నివాసాన్ని మధ్యప్రదేశ్ నుంచి కలకత్తాకు మార్చుకున్నారు. కాలుకు బల్పం కట్టుకున్నట్లుగా బెంగాల్ అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మండల స్థాయి మీటింగ్ ల నుంచి మొదలు పెడితే చిన్నచితక కార్నర్ మీటింగ్ లను సైతం విజయవర్గీయ వదిలి పెట్టడం లేదు. ఇటు బీజేపీకి చెందిన గిరిజన నేతలు, కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజ్వస్వీ సూర్య కూడా… రాష్ట్రంలో వరుసగా యూత్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం… బీజేపీ పార్టీయేనని బెంగాల్ ప్రజలు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ బలపడటాన్ని జీర్ణించుకోలేని తృణమూల్ హత్యా రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల్లో.., ఇప్పటి వరకు 200 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అటు మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ హింసాకాండకు…, రాజకీయ హత్యలకు బలైన…లెఫ్ట్ పార్టీలకు చెందిన లోకల్ లీడర్లు సైతం…, ఇప్పుడు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.
దీంతోపాటు సామాజిక సమీకరణాలకు సంబంధించి కూడా బీజేపీ తనదైన సోషల్ ఇంజనీరింగ్ తో బెంగాల్ లో ముందుకు వెళ్తోంది. మమతా బెనర్జీ… వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి అండగా నిలిచిన మథువా కమ్యూనిటీ ప్రజలు.., ఇప్పుడు బీజేపీకి జై కొడుతున్నారు. అలాగే బెంగాల్ లో కీలకమైన మరోక వర్గం రాజ్ వంశీ కమ్యూనిటీ.! బెంగాల్ లో రాజ్ వంశీయులను… నారాయణ్ సేన గా పిలుస్తుంటారు. ప్రస్తుతం నారాయణసేన నేత అయిన మహారాజా అనంత్ రాయ్ పై మమతా బెనర్జీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. దీంతో ఆయన అసోంలో ప్రవాసంలో ఉంటున్నారు. రాజా అనంత వర్మ బెంగాల్ లో అడుగు పెడితే వెంటనే అరెస్టు చేస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వం బహిరంగంగానే హెచ్చరించింది. దీంతో ఈ వర్గానికి చెందిన మహారాజా అనంత్ రాయ్ ను అమిత్ షా కలిశారు బీజేపీకి మద్దతు ఇచ్చేలా రాజాను ఒప్పించారు. మథువా, రాజ్ వంశీలు, మత్స్యకారులతోపాటు, ఇతర ఓబీసీలు కూడా ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు.
అక్రమ బంగ్లావలసదారుల మూలంగా తమ ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా… బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని అనేక ఊళ్లల్లో నుంచి హిందువుల పలాయనం చేసేలా పరిస్థితులు ఉత్పన్నం కావడం కూడా, ప్రజల తీరులో మార్పునకు ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా… ఫిబ్రవరి 21న ఆదివారం పరివర్తన్ ర్యాలీలో భాగంగా…. కలకత్తాలో బీజేపీ యువమోర్చా నిర్వహించినా… రన్ ఫర్ మోదీ కార్యక్రమం.., మొత్తం కలకత్తా మహానగరాన్ని కాషాయమయంగా మార్చేసింది. ఎక్కడ చూసిన కాషాయ టీ షర్టులు ధరించిన యూతే కనిపించారు. ఈ దృశ్యాలను చూసినా చాలా మంది విశ్లేషకులు, నెటిజన్లు, బెంగాల్ లో ఇక పరివర్తన మొదలైందని…, హ్యాట్రిక్ సాధించాలనుకున్న మమతా దీదీకి…ఈసారి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ ప్రచార ఉదృతిని తట్టుకోలేకే…, మమతా ఇప్పుడు లోకల్ బెంగాల్ సెంటిమెంట్ ను రైజ్ చేస్తున్నారని అంటున్నారు. తనను తాను బెంగాల్ బిడ్డాగా మమతా పరిచయం చేసుకుంటున్నారు. బీజేపీని బయటి పార్టీగా పేర్కొంటున్నారు. దీంతో మమతా ప్రచారానికి దీటు బెంగాల్ … అత్త అల్లుళ్లది కాదు… బెంగాల్ అందరిదంటూ సరికొత్త ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. మొదలు పెట్టడమే కాదు అందుకు సంబంధించి ఫీసీ జావో అనే సాంగ్ ను సోషల్ మీడియా ద్వారా బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే… ఇప్పుడు బెంగాల్ మొత్తంగా బీజేపీ బలం గణనీయంగా పెరిగిందనేది వాస్తవం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు బూత్ స్థాయి కమిటీలను సైతం బీజేపీ ఏర్పాటు చేసిదంటే… బెంగాల్ లో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎంతో కసితో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే సమయంలో… మమతా దీదీ తన గెలుపు భారాన్ని మొత్తం…. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ పైనే వేసిందని అంటున్నారు. తృణమూల్ కు ప్రస్తుతం మమతా ఒక్కరే స్టార్ క్యాంపెయినర్. ఈసారి బెంగాల్ చిత్రపరిశ్రమ కూడా మమతా దీదీ ప్రచారానికి దూరంగా ఉంటోంది. ఏదీ ఏమైనా బెంగాల్ ప్రజలు….ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.