నిర్మల్: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాత్రికి నిర్మల్‌కు చేరుకోనున్నారు. రేపు ఉదయం అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆయన పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి భైంసాకు బండి సంజయ్ చేరుకోనున్నారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు.