కేరళలో అళప్పుజ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. తొలుత ఎస్డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్ శనివారం రాత్రి హత్య చేయగా.. ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ ను చంపేశారు. కేఎస్ షాన్ గతరాత్రి పార్టీ ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిపోయిన షాన్ పై తీవ్రంగా దాడి చేశారు. షాన్ కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంజిత్ శ్రీనివాస్ ను దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేశారు.
ఈ రెండు హత్యలతో అళప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఈ హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
SDPI రాష్ట్ర కార్యదర్శి KS షాన్ ఇంటికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. షాన్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, కారులో వచ్చిన ముఠా అతడిని అడ్డగించి, బైక్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత పదునైన వస్తువుతో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ ఓబీసీ విభాగం కార్యదర్శిగా ఉన్న బీజేపీకి చెందిన రంజిత్ శ్రీనివాసన్ ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతన్ని నరికి చంపారు.
జిల్లాలో రెండు రోజులు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనవసరమైన సమావేశాలకు అనుమతించబోమని అధికారులు తెలిపారు. “ఇలాంటి హేయమైన మరియు అమానవీయమైన హింసాత్మక చర్యలు రాష్ట్రానికి ప్రమాదకరం, అటువంటి కిల్లర్ గ్రూపులను, విద్వేషపూరిత వైఖరిని క్షమించమని” ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతేకాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ హత్యలకు భాజపా, ఎస్‌డిపిఐలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.
గత 60 రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన మూడో దారుణ హత్య ఇది. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు పీఎఫ్‌ఐ గూండాలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా అత్యంత దారుణంగా హతమార్చడం చోటు చేసుకుంది.