More

    జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. ఎవరెవరిని తప్పించారంటే

    జాతీయ నూతన కార్యవర్గాన్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, డాక్టర్ మురళి మనోహర్ జోషి, మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేషనల్ ఆఫీస్ బేరర్స్‌తో సహా 80 మంది సభ్యులను ఆహ్వానించారు. జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు… 179 శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో) ఇందులో ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, అసెంబ్లీ, కౌన్సిల్స్‌లో శాసనసభా పక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, జాతీయ వక్తలు, జాతీయ మోర్చా ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రభారిస్/సాహ్-ప్రభారిస్, స్టేట్అధ్యక్షులు,రాష్ట్ర జనరల్ సెక్రటరీలను సభ్యులుగా ప్రకటించారు.

    ఇక ఈ కార్యవర్గంలో తెలుగువారికి పెద్దపీట వేశారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావులకు చోటు లభించింది. ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించారు. ఆఫీస్ బేరర్లలో తెలంగాణ నుంచి డీకే అరుణను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపిక చేశారు. జాతీయ కార్యదర్శిగా ఏపీ నుంచి సత్యకుమార్ ను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్ లకు స్థానం లభించింది.

    బీజేపీలో అగ్రనేతలు వరుణ్ గాంధీ, ఆయన తల్లి మనేకాగాంధీకి అధిష్టానం భారీ షాకిచ్చింది. తాజాగా లఖీంపూర్ లో జరిగిన హింసాకాండను ఖండిస్తూ తాజాగా వరుణ్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో వారిద్దరికీ చోటివ్వలేదు. బీజేపీ ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో 80 మంది రెగ్యులర్ సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, మరో 179 మంది శాశ్వత ఆహ్వానితులు ఉన్నారు. ఇందులో ఏ జాబితాలోనూ వరుణ్ గాంధీతో పాటు మనేకాగాంధీకి చోటు దక్కలేదు. ఇప్పటికే కేంద్రమంత్రి పదవి ఇవ్వలేదని వరుణ్ అసంతృప్తిగా ఉండగా.. కేంద్రమంత్రిగా పనిచేసిన మనేకాగాంధీని ఆ తర్వాత తప్పించారు.

    Trending Stories

    Related Stories