More

    బీజేపీ ఎంపీ రంజీతపై రాత్రి 11:30 సమయంలో దాడి..!

    భారతీయ జనతా పార్టీ ఎంపీ రంజీత కోలిపై దాడి చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజస్థాన్ లోని భరత్ పూర్ ఎంపీపై గురువారం రాత్రి దాడి చేశారు. ధర్సోని గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి 11:30 సమయంలో ఆమె వాహనాలపై అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రంజీత కారుపై రాళ్ళతోనూ, రాడ్ల తోనూ దాడి చేశారు. కారు అద్దాలను రాడ్లతో పగులగొట్టారు. ఈ ఘటనతో ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెకు, ఆమె అనుచరులకు తీవ్ర గాయాలు అవ్వలేదని తెలుస్తోంది. కొద్ది సేపు చికిత్స అందించాక ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

    క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పేందుకు ఆమె ప‌లు ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించారు ఎంపీ రంజీత. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్‌ వెళ్తుండ‌గా, గుర్తు తెలియ‌ని వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. కారు అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఎంపీ అనుచ‌రుల‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందేలా చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు. రాత్రి స‌మ‌యంలో దాడి జ‌ర‌గ‌డంతో నిందితులను గుర్తించలేకపోయాన‌ని రంజీత తెలిపారు.

    రంజీత మీడియాతో మాట్లాడుతూ ’11:30 సమయంలో అయిదు-ఆరు మంది కారుపై దాడి చేశారని.. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తూ ఉన్నారని.. త్వరలో పట్టుకుంటారని’ తెలిపారు. రంజీత తొలి సారి ఎంపీగా గెలిచారు. ఆమె మామ గంగారాం కోలీ మూడు సార్లు బయానా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. రంజీత వాహనం ధ్వంసమైన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

    Image

    Trending Stories

    Related Stories