More

  పోలవరంపై ఆ రెండు పార్టీల ప్రగల్భాలు.. ప్రాజెక్టులపై చర్చకు జీవీఎల్ సవాల్..!

  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తుంటే చంద్రబాబు ప్రగాల్బాలు ఏంటీ? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. టీడీపీ హయాంలో ఏ ప్రాజెక్ట్ కట్టారో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో దశాబ్దాల కాలంగా పెండింగ్‎లో ఉన్న వంశధార, తోటపల్లి, దక్షిణాంధ్రలో వెలుగోడు ప్రాజెక్ట్‎ల సంగతేంటీ అని.. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నివేదిక తయారు చేశామని చెప్పారు. రాష్ట్రానికి మేము ఏంచేశామో.. మీరు ఏమీ చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

  పోలవరం మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. పోలవరం ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పోలవరంపై తాము బాహుబలిగా వైసీపీ అభివర్ణించుకుంటోందని ఎద్దేవా చేశారు. మిగిలిన పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పిల్లిగా మారిపోతోందన్నారు. నీటివనరులపై సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే దమ్ము వైసీపీకి ఉందా అని సవాల్ విసిరారు.

  విశాఖలో భూములను పెద్ద సంఖ్యలో కొట్టేస్తున్నారని జీవీఎల్ అన్నారు. సిట్ రెండు నివేదికలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణాలపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చించబోతున్నామని తెలిపారు. విశాఖకు వచ్చే ఏప్రిల్ నాటికి 5జీ సేవలు వస్తాయన్నారు. వందేభారత్ రైలు మూడింటిని విశాఖ నుంచి నడపబోతున్నామని చెప్పారు. విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్టీపీఐని బలోపేతం చేయాలని.. ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసుకోవాలని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

  Trending Stories

  Related Stories