మండలిలో ప్రజాగళం..బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు

0
757

రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. ఎంతో కష్టపడితే కానీ పార్టీ పరంగా ప్రజాప్రతినిధిగా నిలబడే అవకాశాలు రావు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు కు రాజకీయంగా అవకశాలు ఊరికే రాలేదు. ఆయనకు కష్టం విలువ తెలుసు అంటారు ఆయన గురించి బాగా తెలిసినవారందరు.!

రాంచందర్ రావుకు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ.! బాల్యం నుంచే ఆయన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ . ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాల్లో సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 లో భారతీయ జనతా పార్టీ…ఆయన్ను  హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టెక్నికల్ గా ఓటమి పాలయ్యారు. ఇక్కడ టెక్నికల్ గా అని ఎందుకంటే…2009లో రాంచందర్ రావుకు రైట్ మార్క్ తో మొదటి ప్రాధాన్యతగా వేసిన దాదాపు మూడు వేలకు పైగా ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించడం జరిగింది. దీనిపై ఆయన న్యాయ పోరాటం కూడా చేశారు.

2015లో రెండోసారి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని దేవిప్రసాద్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2015లో తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా అడుగుపెట్టిన ఎన్.రాంచందర్ రావు… సభలో బీజేపీ తరపున ప్రజాగళంగా మారారు. అప్పటికే మండలిలో కాంగ్రెస్ సభ్యులు చాలా మంది అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో…, ప్రజలపక్షాన అధికార ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను ఆయన తీసుకున్నారు. మండలి సభలో జరిగిన ప్రతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలు, నిర్ణయాలపై ఆయన మండలిలో గళమెత్తారు. మండలి సభ్యుడిగా తన ఆరు సంవత్సరాల ప్రస్థానంలో చర్చల సందర్భంగా తాను ప్రసంగించిన పలు అంశాలను గ్రంథ రూపంలో తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. రాంచందర్ రావుకి సౌమ్యుడనే పేరుంది. చర్చల సందర్భంలో ఆయన సుతిమెత్తిని విమర్శలు చేసేవారు. ఎన్నడూ కూడా వ్యక్తిగత విమర్శలకు దిగేవారు కాదు. ఉద్యోగుల సమస్యలపైనా, అలాగే నిరుద్యోగుల సమస్యలపైనా, నియమాకాలపైనా, నిధులపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాదు ఎమ్మెల్సీగానే ఉంటూ కొంతకాలం పాటు రాంచందర్ గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. ఈ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అనేక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించారు.

ఎమ్మెల్సీగా రాంచందర్ రావు పనితీరును గుర్తించిన బీజేపీ అధిష్ఠానం… రెండోసారి కూడా ఆయన్నే పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే…అనే భావన పబ్లిక్ రోజు రోజుకు బలంగా నాటుకుంటున్న ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో కమలం పార్టీ పెద్దలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ తోపాటు మిగిలిన హిందూ సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, అలాగే న్యాయవాద సంఘాలు రాంచందర్ రావుకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీకి పార్టీ పరంగా బూత్ స్థాయి వరకు కార్యకర్తల బలం ఉండటంతో ప్రచారాన్ని గ్రౌండ్ లేవల్ కు తీసుకువెళ్లారు. ప్రతి 25 మందికి  పార్టీ తరపున ఒక క్రియశీల కార్యకర్తను నియమించి.. వారిని కలిసి రాంచందర్ రావుకు ఓటు వేసేలా అభ్యర్థించారు. వాట్సాప్ గ్రూప్ లతోపాటు ట్వీటర్, ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కమలం పెద్దలు కూడా రాంచందర్ గెలుపుపై ధీమాపై వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  మార్చి 17వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

15 − seven =