మునావర్ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై నేను కామెంట్స్ చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

0
785

స్టాండ్-అప్ కమెడియన్ మునవర్ ఫరూఖీ హైదరాబాద్‌లో షో పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. మునావర్ షో ను జరగనివ్వమని గతంలో కూడా హెచ్చరికలు వచ్చాయి. ఈ సంవత్సరం జనవరిలో షో రద్దు చేసుకున్నాడు. ఇక త్వరలో హైదరాబాద్ లో జరగబోయే షో పై కూడా నీలినీడలు కమ్ముకుంటూ ఉన్నాయి. తర్వాత, రైట్‌వింగ్‌లు మరోసారి ఈవెంట్‌ను ఆపాలని పిలుపునిచ్చారు.

మునావర్ ఫరూకీపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20న ఆయన కామెడీ షో చేస్తే 22న సోషల్ మీడియాలో తన కామెడీ షో స్టార్ట్ అవుతుందన్నారు. సీతారాములపై మునావర్ చాలా నీచంగా మాట్లాడారని.. అలాంటి ఫరూకీని కొంతమంది రమ్మని పిలుస్తున్నారని, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెబుతున్నారని, ఏం కాకుండా చూస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. మరొక్కసారి సీతారాములను తిట్టివెళ్లిపొమ్మని పిలుస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో అడుగుపెడితే తమ రియాక్షన్ ఏంటో చూస్తారని ఇప్పటికే హెచ్చరించానని.. మునావర్ ఏ దేవుడిని మొక్కుతాడో ఆయనపై తాను కూడా కామెంట్స్ చేస్తానంటూ రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన మొక్కే దేవుడు చిన్న పిల్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని తాను కూడా కామెంట్ చేస్తానన్నారు. నుపుర్ శర్మ చేసిన చిన్న కామెంట్‌ దేశం మొత్తం పెద్ద సమస్య అయిందన్నారు. మునావర్ హైదరాబాద్‌లో కాలుపెడితే తన యాక్షన్, రియాక్షన్ చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు రాజా సింగ్.