రాహుల్, అసదుద్దీన్, స్వరా భాస్కర్ అల్లర్లు ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు

0
752

లోనీలో చోటు చేసుకున్న దాడిపై నకిలీ వార్తలను ప్రచారం చేసి.. మతపరమైన అల్లర్లను ప్రేరేపించడానికి ప్రయత్నించినందుకు ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ ఎండి జుబైర్, ట్విట్టర్, ది వైర్, పలువురు జర్నలిస్టులపై యుపి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బిజెపి ఎమ్మెల్యే నంద్ కిషోర్ మరికొందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, స్వరా భాస్కర్, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తదితరులు తన నియోజకవర్గంలో అల్లర్లను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని లోనీకి చెందిన ఎమ్మెల్యే నంద కిషోర్ పోలీసులకు లేఖ రాశారు.

ఆ లేఖలో రాహుల్ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి, స్వరా భాస్కర్ మరియు ఇతరులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి మతపరమైన అల్లర్లను ప్రేరేపించడానికి ట్వీట్లను పోస్ట్ చేసారు. అబ్దుల్ షమద్ సైఫీపై దాడి చేసినందుకు శ్రీరాముడిని, అతని భక్తులను నిందించారు. ముస్లిం యువకులు కూడా అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు మతపరమైన రంగు పూయడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఇది రుజువు చేస్తోందని తెలిపారు.

ఇది పక్కా ప్రణాళికతో కూడిన కుట్ర అని, ‘లోనీ’లో మాత్రమే కాకుండా ఉత్తర ప్రదేశ్ మొత్తం మత అల్లర్లను ప్రేరేపించే కుట్రలో భాగమని నంద్ కిషోర్ గుర్జార్ లేఖలో రాశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిందించవచ్చని.. రాహుల్ గాంధీ, ఒవైసీ, స్వరా భాస్కర్, ఇతర కుట్రదారులు ఈ కేసులో హిందువులను మాత్రమే నిందితులుగా ట్వీట్ చేశారని.. అలా చేయడంద్వారా లోనీలో హిందూ-ముస్లిం అల్లర్లు చెలరేగాయని తెలిపారు. ఎన్‌ఎస్‌ఏ కింద రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ, స్వరా భాస్కర్ మరియు ఇతరులపై కేసులు నమోదు చేయాలని, దేశ ఐక్యతను కాపాడేలా వారిపై బలమైన చర్యలు తీసుకోవాలని గుర్జార్ లేఖలో పేర్కొన్నారు.

నిజా నిజాలు తెలుసుకోకుండా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై మతం రంగు పూయడానికి ప్రయత్నించారు. ‘ఫాక్ట్-చెకర్’ ఎండి. జుబైర్ దాడి చేసిన వారు ‘జై శ్రీ రామ్’ అని బలవంతం చేశారనే నకిలీ వార్తలను వ్యాప్తి చేశాడు. ఈ సంఘటనకు మతం రంగును ఇచ్చారు. ఇదే వాదనను సోషల్ మీడియాలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ప్రచారం చేశారు. జూన్ 15 న, రాహుల్ గాంధీ తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.. రాముడు యొక్క నిజమైన భక్తులు అలాంటి పని చేస్తారని తాను నమ్మలేనని చెప్పాడు. ఇటువంటి క్రూరత్వం మానవత్వానికి మైళ్ళ దూరంలో ఉందని.. ఇది సమాజానికి, మతానికీ రెండింటికీ సిగ్గుచేటు అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఈ ఘటన వెనుక మతం ఉందనే వాదనకు బలం చేకూర్చారు.

ఎప్పటి లాగే నటి స్వరా భాస్కర్ కూడా ఘటనకు మతం రంగు పూశారు. ముస్లిం వ్యక్తి ‘ జై శ్రీ రామ్’ అని నినదించాల్సి వచ్చిందని స్వరా భాస్కర్ చెప్పుకొచ్చారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రధాన నిందితుడు ప్రవీష్ గుజ్జర్ ‘జై శ్రీ రామ్‌’ అని చెప్పాలని డిమాండ్ చేశారని సైఫీని బలవంతం చేశాడని ఆమె తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వెలువడిన వీడియోకు ఆడియోనే లేదన్నది వాస్తవం. నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన జుబైర్ వీడియోను తొలగించిన తర్వాత కూడా ఆమె తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో కొనసాగించారు.

ఇక అసదుద్దీన్ ఒవైసీ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ముస్లింలపై పెంచుతున్న ద్వేషం వల్ల వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చోటు చేసుకుందని అసదుద్దీన్ ఒవైసీ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ నేరానికి యూపీలోని బిజెపి ప్రభుత్వాన్ని కూడా ఆయన నిందించారు.

ఈ కేసుపై దర్యాప్తు నిర్వహించిన ఘజియాబాద్ పోలీసులు ఈ దాడి వెనుక మతపరమైన కోణం లేదని ధృవీకరించారు. ఇది కేవలం వ్యక్తిగత శత్రుత్వం ద్వారా చోటు చేసుకున్న ఘటన అని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు తాతబీజ్‌ను ప్రవీష్ గుజ్జార్‌కు విక్రయించాడని, అయితే అది తనకు ప్రయోజనం చేకూర్చకుండా తనకు హాని కలిగించిందని గుర్జార్ భావించి దాడి చేశాడు. మతతత్వ అల్లర్లను ప్రేరేపించడానికి నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు జుబైర్, రానా అయూబ్, ది వైర్, సల్మాన్ నిజామి, మక్సూర్ ఉస్మాని, సమా మొహమ్మద్, సబా నఖ్వీ, ట్విట్టర్లపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here