అక్కడ కేజ్రీవాల్ అండ్ కో కు భారీ భంగపాటు తప్పదట..!

0
918

ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో కూడా సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. పెద్ద ఎత్తున ఉచితాలను కూడా ప్రకటించుకుంటూ వెళుతున్నారు కేజ్రీవాల్. అయితే ఎన్నికల్లో ఆయనకూ.. ఆయన పార్టీకి భంగపాటు తప్పదని అంటున్నాయి సర్వేలు. ఆ పార్టీకి దక్కేది రెండు సీట్లు మాత్రమేనని ఏబీపీ న్యూస్-సీఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 99 స్థానాలను కైవసం చేసుకోగా ఈసారి 135 నుంచి 143 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆప్ఎంత పోరాడినా చాలా తక్కువ సీట్లు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ కారణంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గత ఎన్నికలతో పోలిస్తే తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆప్‌కు 17.4 శాతం వరకు రాబట్టే అవకాశం ఉందట.