తమిళనాడులో హిందుత్వ జపం

0
748

ఒకప్పుడు తమిళనాడు అనగానే ద్రవిడవాద పొలిటిక్స్ కు పెట్దింది పేరు. పెరియార్ వాదం, హిందు వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత, ఉత్తర భారతీయులు అంటూ ప్రత్యేక తమిళవాదాన్ని వినిపించే ఆ పార్టీలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల … హిందూ జపం చేస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, అలాగే విపక్ష డీంకే పార్టీలు పోటాపోటీగా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ సెంటిమెంట్ కు పెద్దపీఠ వేశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డీఎంకే పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ దేవాలయాల కోసం బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అన్నాడీఎంకే కూడా ఇంచుమించు అవే హామీలు ఇచ్చింది.

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పోటాపోటీగా…ఆల్ ఫ్రీ అంటూ హామీల వర్షం కురిపించడంతో అందరి దృష్టి బీజేపీపై పడింది. ద్రవిడ పార్టీలే హిందుత్వ జపం చేస్తుంటే…, ఇక హిందుత్వ బ్రాండ్ కు తమ పార్టీ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా వ్యవహారించే కమలం పార్టీ తమిళ హిందువుల కోసం ఇంకేం ప్రకటిస్తోందని అంతా ఆసక్తిగా బీజేపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూశారు. ఆలయాల పునరుద్ధరణ కోసం నిధులు కాదు.., ఏకంగా హిందూ దేవాలయాల నిర్వహణకు సంబంధించి  మేధావులు సాధు సంతులతో కూడిన ఒక ప్రత్యేకధార్మిక బోర్డును ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్.మురుగున్ , రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జ్ సీటీ రవి, సహ ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంతేకాదు బలవంతంగా కానీ, ప్రలోభాల ద్వారా కానీ మత మార్పిడీలు చేయకుండా కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని సైతం తీసుకువస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే తమిళనాడులోని శరణార్థుల శిబిరాల్లో జీవిస్తున్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రాన్ని కోరుతామని తెలిపింది. ఎలక్ట్రానిక్ రేషన్ కార్డు ద్వారా పీడీఎస్ ద్వారా సరకులను నేరుగా ఇంటి వద్దనే ప్రజలకు అందజేస్తామని హామీ ఇచ్చింది.

ఇంకా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో మల్టి స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని.. రైతుల తరహాలో మత్స్యకారులకు సైతం ఏటా రూ. 6వేల సాయం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కొత్తగా 50 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపింది.

ఇంకా 18 సంవత్సరాల నుంచి 23 ఏళ్ళ వయస్సులోపు వారందరికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్,  దళితులకు 12 లక్షల ఎకరాల భూ పంపిణి వంటి తదితర హామీలను బీజేపీ ఇచ్చింది. అన్నాడీఎంకే కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తున్న బీజేపీ 20సీట్లల్లో మాత్రమే బరిలో నిలిచింది.  ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =