More

    సాయి పల్లవి వ్యాఖ్యలపై స్పందించిన విజయశాంతి

    కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఆవులను రవాణా చేస్తున్న వ్యక్తులపై దాడి గురించి వ్యాఖ్యలు చేసిన నటి సాయిపల్లవిపై హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయ సలహా తీసుకున్న మీదట సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    సాయి పల్లవి వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి విజయశాంతి స్పందిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. “కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం… ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుందని” విజయశాంతి అన్నారు. “డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం…. తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా?” అని విజయశాంతి ప్రశ్నించారు. ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని హితవు పలికారు. “నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ.. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో.. సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి” అని అన్నారు. “సినిమా రిలీజ్ సమయం కాబట్టి.. ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది” అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories