More

    కిరాతకంగా బీజేపీ నేత కుమారుడి హత్య

    బీహార్ లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తున్న ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా బీహార్‌లో బీజేపీ నేత కుమారుడిని అతి కిరాతకంగా చంపేశారు. సమస్తిపూర్‌లో బీజేపీ నేత కుమారుడు సందీప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. దుర్గాపూజ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా దాడులు జరిపారు. కత్తిపోటుకు గురై ప్రాణాలు విడిచాడు.

    సందీప్ సమస్తిపూర్‌లోని హజ్‌పూర్వా ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు పల్తాన్ రామ్ కుమారుడు. రాత్రి సమయంలో సందీప్ కుటుంబం అతనిని సంప్రదించడానికి ప్రయత్నించింది, కానీ అతనికి ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. రాత్రి అంతా అతని కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. రక్తపుమడుగులో ఉన్న సందీప్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం కార్యక్రమాలు పూర్తీ చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ప్రత్యర్థి వర్గం వారే చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.

    Trending Stories

    Related Stories