More

    అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్‌లోకి వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేని ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

    మునుగోడు బై పోల్ ఐదో రౌండ్ ఫలితం వెల్లడి ఎందుకు ఆలస్యమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. చాలా అనుమానాలు ఉన్నాయని.. అనుభవంలేని అధికారులకు కౌంటింగ్ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. వారి తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునే ఆలస్యమవుతోందన్న సీఈఓ వికాస్ రాజ్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. మొదటి నాలుగు రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories