More

    ఆప్ నేతలు టపాసులు కాలుస్తున్న వీడియోను పోస్టు చేసి కేజ్రీవాల్ కు షాకిచ్చిన బీజేపీ

    దీపావళి పర్వదినాన బాణసంచాను నిషేధిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..! ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో పటాకులు కొని, పేల్చితే 200 జరిమానానే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు గోపాల్ రాయ్ ప్రకటించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9B కింద వారికి ₹5,000 జరిమానా కూడా విధించబడుతుంది.

    ఢిల్లీలో కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రాజ్ కుమార్ ఆనంద్ మద్దతుదారులు ఆయన నివాసంలో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్న వీడియోను బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా పోస్టు చేశారు. ఇవన్నీ కనిపించవా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డమే కాకుండా.. ఆయన హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. ఈ సందర్భంగా బగ్గా ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, “హిందువులు దీపావళి రోజున క్రాకర్స్ కాల్చినట్లయితే, కాలుష్యం ఏర్పడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ వారిని జైలుకు పంపుతారు, కానీ ఆ పార్టీ నేత మంత్రి అయినందుకు సంబరాలు చేసుకుంటే, దాని నుండి ఆక్సిజన్ బయటకు వస్తుంది. కేజ్రీవాల్, మీ హిందూ వ్యతిరేకత మళ్లీ బట్టబయలైంది. మీకు దీపావళితో సమస్య ఉంది, బాణసంచాతో కాదు, ” అని బగ్గా విమర్శించారు.

    Trending Stories

    Related Stories