More

    ఏపీలో జనసేనతో మాత్రమే: డాక్టర్ లక్ష్మణ్

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఏపీలో తమకు జనసేన పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో పొత్తు లేదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఆలోచనే లేదన్నారు. ఏపీలో అభివృద్ధి జరగడంలేదని, బీజేపీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీదే అధికారం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు.

    బీజేపీ ఏపీ శాఖ చేప‌ట్టిన ప్రజాపోరులో భాగంగా గురువారం తిరుప‌తిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ల‌క్ష్మ‌ణ్ పాల్గొన్నారు. జ‌గ‌న్ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఏపీకి శాపంగా మారాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింద‌న్నారు. జ‌గ‌న్ వైఖ‌రి వ‌ల్లే ఏపీ పున‌ర్విభ‌జ‌న‌ చ‌ట్టం నీరుగారిపోతోందని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. ఏపీ ప్ర‌భుత్వం రూ.8 ల‌క్ష‌ల కోట్ల మేర అప్పులు చేసిందని, ఫ‌లితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌న్నారు. ఏపీతో పాటు తెలంగాణ‌లోనూ కుటుంబ పాల‌న‌లు సాగుతు‌న్నాయని ఆయ‌న అన్నారు.

    Trending Stories

    Related Stories