More

    బీజేపీ కిసాన్ మోర్చా శిక్షణ తరగతులు

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 9, 10, 11వ తేదీలలో బీజేపీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రాష్ట్ర శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‎రెడ్డి నేతృత్వంలో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‎రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేరనివ్వట్లేదని శ్రీధర్‎రెడ్డి విమర్శించారు. ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.

    Trending Stories

    Related Stories