More

    జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంగా మారింది: భానుప్రకాశ్‎రెడ్డి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో సంక్షోభం దిశగా పయనిస్తోందని బీజేపీ నేత భానుప్రకాశ్‎రెడ్డి విమర్శించారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపైన తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఐపీసీ బదులు వైసీపీ అమలవుతోందని అన్నారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతులను వేధిస్తోందని “అమరావతి” జగన్‎కు “కమ్మరావతి”గా కనిపించటం శోచనీయమని అన్నారు.

    Trending Stories

    Related Stories