ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ “అ” పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఆరోపించారు. అవినీతి, అరాచకంతో పాటు అమరావతి మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిని వేధించి జైల్లో పెడుతున్నారని అన్నారు. పాలకుల అవినీతికి అంతేలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఎంపీ కుటుంబసభ్యులు వేల కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడితే.. తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి అనటం హాస్యాస్పదమన్నారు. విజయసాయిరెడ్డి అవినీతి విశాఖలో మొదలై నెల్లూరు వరకు తూర్పు తీరమంతా వ్యాపిస్తోందని ఆంజనేయరెడ్డి ఆరోపించారు.