బీజేపీపై ముస్లింలను రెచ్చగొడుతున్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా పిర్యాదు చేశామన్నారు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని.. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం..హిందూ వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కాకినాడ జెఎన్ టి యూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధి లో ఉందని.. ఆ స్థలం కోసం కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. ఆ స్థలం గత ముప్పై సంవత్సరాల నుండి కోర్టు పరిధిలోనే ఉందన్నారు.
కొద్దిరోజుల కిందట ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ వెల్లడించారు. ముస్లింలు తలచుకుంటే మీరెంత అని అనడం వెనక ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉద్దేశం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలే ఆశ్చర్యపోయారని.. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.