More

    బిగ్ బ్రేకింగ్.. కూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న డిఫెన్స్ విమానం

    డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన సిబ్బంది, కొంతమంది కుటుంబ సభ్యులు తమిళనాడులోని కోయంబత్తూరు, సూలూరు మధ్య కుప్పకూలిన ఎంఐ-సిరీస్ ఛాపర్‌లో ఉన్నారు. రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఆరు అంబులెన్స్ లను ఘటనా స్థలంలో ఉంచారు.

    నీలగిరులలో ఆర్మీ ఛాపర్ కూలిపోయింది, అత్యవసర బృందాలు స్పాట్‌లో ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విమానంలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన అధికారులను ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తో పాటూ కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఎంఐ హెలికాఫ్టర్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories