More

    ఆయన ఎంతో పవర్ ఫుల్.. రక్షణ దళాలను మరింత పవర్ ఫుల్ చేశారు

    రక్షణ దళాల చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా సీడీఎస్ బిపిన్ రావత్ మరణం నిలిచింది. తాను శిక్షణ పొందిన డిఫెన్స్ కాలేజీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతూ తమిళనాడులోని నీలగిరి వద్ద నంజప్పన్ ఛత్రం వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనలో రావత్ తో పాటు భార్య మధులిక సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందారు.

    63 ఏళ్ల బిపిన్ రావత్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్. ఆయనది సైనిక కుటుంబం. రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ సైనిక ఉన్నతాధికారి. తండ్రి బాటలోనే రావత్ కూడా సైన్యంలోకి వచ్చారు. భారత ఆర్మీతో ఆయన అనుబంధం 1978లో మొదలైంది. గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ లో ప్రస్థానం ప్రారంభించిన రావత్.. సైన్యంలో చేరిన ఏడాదే సెకండ్ లెఫ్టినెంట్ హోదా సాధించారు.

    అక్కడ్నించి లెఫ్టినెంట్ గా, ఆర్మీ కెప్టెన్ గా, లెఫ్టినెంట్ కల్నల్ గా, కల్నల్ గా, బ్రిగేడియర్ గా, లెఫ్టినెంట్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవీ నియామకం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 17 కమాండ్లను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత ఆయనే తీసుకున్నారు. రక్షణ రంగంలో ఇటీవల కాలంలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకోడానికి కారణం అయ్యారు. లడఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా వ్యవహరించారు. చైనాను అడ్డుకోవడంలో కూడా జనరల్ బిపిన్ రావత్ సక్సెస్ అయ్యారు. దేశం కోసం ఆయన అందించిన సేవలకు గుర్తుగా అనేక సేవా మెడల్స్ వరించాయి. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు పిలుపును ఇచ్చారు.

    Trending Stories

    Related Stories