వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ‘నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను. వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉంది. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని క్లింటన్ ట్వీట్ చేశారు.
బిల్ క్లింటన్ వయసు 76ఏళ్లు. ఆయనకు భార్య హిల్లరీ క్లింటన్, కుమార్తె చెల్సియా ఉన్నారు. 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 2004 నుంచి వరుసగా ఆయనను అనారోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. గుండెపోటు రావడంతో స్టంట్లు వేశారు.