More

    ఎదురుగా చెక్ పోస్టు.. తప్పించుకుందామనుకుని

    లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ నిఘాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..! లాక్ డౌన్ సమయాల్లో బయటకు రావొద్దని చెబుతూనే ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో బయటకు బైకులపై వచ్చిన వారిపై పోలీసులు జరిమానా విధిస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడ పట్టుకుని ఫైన్ వేస్తారనే ఉద్దేశ్యంతో వెళ్ళిపోయిన యువకులకు విషయంలో ఓ ఘోరం చోటు చేసుకుంది. ఓ యువకుడి ప్రాణం పోగా.. ఇంకొక యువకుడికి జీవితాంతం తన వల్ల స్నేహితుడు మరణించాడనే బాధ వెంటాడుతుంది.

    మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైక్ పై దండేపల్లి నుండి జన్నారం వైపు వెళ్లారు.. అదే సమయంలో తపాల్ పెట్ చెక్ పోస్ట్ దండకర్రను దించేసి ఉన్నారు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని భయపడి.. ఆ కర్ర కింద నుండి వెళ్లిపోవచ్చని అనుకున్నారు. బైక్ ను డ్రైవ్ చేస్తున్నా యువకుడు తలవంచి తప్పించుకున్నాడు. వెనుక ఉన్న మరో యువకునికి దండను గమనించకపోవడంతో తల కర్రకు తగిలింది. దీంతో అతడు ఒక్కసారిగా బైక్ కింద నుండి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు సంఘటన స్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి సంబంధించిన విజువల్ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.. సీసీ పుటేజీ ఆదారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. తన వెనుక ఉన్న స్నేహితుడు పడిపోయాడని కూడా గుర్తించకుండా బైక్ నడుపుతున్న యువకుడు వెళ్ళిపోయాడు.

    Trending Stories

    Related Stories