ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని బిజ్నోర్ కు చెందిన ఓ లెక్చరర్ విద్యార్థినులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపాడన్న ఆరోపణలపై వీర ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మహ్మద్ అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని తన ప్రియురాలిగా ఉండమని, తనను పెళ్లి చేసుకోమని అడిగాడని తెలుస్తోంది. వాట్సాప్ లో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చాటింగ్ కు సంబంధించి మొహమ్మద్ అర్షద్‌ను ఓ విద్యార్థిని మీరు నా ఉపాధ్యాయుడు.. మీరు మీ లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది అని అడిగింది. అందుకు అతడు సమాధానం ఇస్తూ.. నీ ప్రియుడుగా ఉండనివ్వు అంటూ విద్యార్థినికి ఆఫర్ ఇచ్చాడు. విద్యార్థినికి ఇలాంటి అనుచితమైన ప్రతిపాదన పెట్టడానికి అతనికి ఎంత ధైర్యం అని అమ్మాయి ప్రశ్నించింది. దానికి బదులుగా అర్షద్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. కావాలంటే పెళ్లి చేసుకోడానికి రాజీనామా చేస్తానని అర్షద్ ఆమెకు చెప్పాడు.
మహ్మద్ అర్షద్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, మెసేజీలు కూడా చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. మహ్మద్ అర్షద్‌పై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కాలేజీ యాజమాన్యానికి తెలిపింది. ఈ కళాశాల బిజ్నోర్ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే, BSP అభ్యర్థి రుచి వీర కుటుంబానికి చెందినది. ఈ ఘటన తర్వాత మహ్మద్ అర్షద్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు. IPC, IT చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.