More

    సైనిక కుటుంబాల గురించి బూతు షోలు.. ఏక్తాకపూర్ పై అరెస్ట్ వారెంట్

    బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ‘ఆల్ట్ బాలాజీ’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసి ఎన్నో బూతు షోలను కూడా ప్రమోట్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఆమె ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు వచ్చాయి. బీహార్ లోని బెగుసరాయ్‌లో ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై కేసు నమోదయింది. 2020లో శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

    ఏక్తా కపూర్, శోభా కపూర్‌లు వారి వెబ్ సిరీస్ XXX రెండవ సీజన్‌లో వివాదాస్పద సన్నివేశాలను చూపించిన కారణంగా.. అరెస్ట్ వారెంట్లు అందుకున్నారు. తమ షో ద్వారా మనోభావాలను దెబ్బతీసినందుకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని జిల్లా కోర్టు నుండి అరెస్ట్ వారెంట్లు అందుకున్నారు. ఎరోటిక్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్‌లో సైనికులను అవమానించడం, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలపై తల్లీ-కూతుళ్లపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బెగుసరాయ్ నివాసి అయిన ఒక మాజీ సైనికుడు చేసిన ఫిర్యాదు కారణంగా ఏక్తా కపూర్ అండ్ కో చిక్కుల్లో పడ్డారు. రెండవ సీజన్‌లో సైనికుడి భార్యకు సంబంధించిన అనేక అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. ఏక్తా, శోభా కపూర్ లను సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించారని కోర్టుకు తెలియజేశారు. అయితే వారు కోర్టుకు హాజరుకాలేదు, దీంతో వారిపై వారెంట్ జారీ చేశారని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories