అంతా…. గ్రేటా థన్ బెర్గ్ టూల్ కిట్ లో పేర్కొన్న ప్రణాళిక ప్రకారమే జరుగుతోందా..? భారత దేశానికి రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారునున్నాయా? అంతర్జాతీయంగా భారత్ పేరును బద్నామ్ చేసేందుకు… దీర్ఘకాలిక కుట్రలకు తెరలేపారా? 2022 వచ్చేనాటికి భారత్ కు మరింత ప్రమాదం పొంచివుందా? స్పాన్సర్డ్ ఆందోళనలు…, ఇంకా అసలు ఇష్యూయే కాని దానిని కూడా…, పెద్ద సమస్యగా మార్చి.., దానిని వెనక్కు తీసుకోవడమే తప్ప…, ఇక పరిష్కారమే లేని విధంగా., చిత్రీకరించే ప్రయత్నాలు., దేశంలో ఇక తరచుగా జరుగుతూనే ఉంటాయా? ఈ కుట్రల్లో అంతర్జాతీయ పత్రికల నుంచి మొదలు పెడితే రీజినల్ గా నడిచే ప్రాంతీయ పత్రికలు సైతం భాగస్వాములుగా ఉన్నాయా?
ఏమిటీ… ఈ ప్రశ్నల పరంపర అని మీరనుకుంటున్నారా? అయితే వినండి.! భారత దేశానికి…, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగటివ్ నెరెటీవ్ ను…, క్రమంగా బిల్డప్ చేసేందుకు…జరుగుతున్న ప్రయత్నాలకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ గురించి.! భారత్ అన్నా… భారతీయులు అన్నా…, ఎప్పుడూ చిన్నచూపు చూడటం.., టైమ్ మ్యాగజైన్ నైజం.! 2019లో సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న వేళా… టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీ స్టోరీలో ప్రధాని మోదీని విభజన సారథి అనే టైటిల్ పెట్టి మరి తూలనాడింది.
తాజాగా ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన మార్చి నెల ప్రత్యేక సంచికలో… ఢిల్లీలో రైతు పేరుతో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫోటోతో ఉన్న కవర్ పేజీని ప్రచురించింది. దానిని ట్వీటర్ లో విడుదల చేసింది. నన్ను బెదిరించలేరు…, నన్ను కొనలేరు.., అనే శీర్షికతో ఓ కథనాన్ని కూడా రాసింది.
ముఖ్యంగా ఆ కథనంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అంశాన్ని ప్రస్తావించింది. ఈ చట్టలను రద్దు చేయాలని గత 100 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్నారని…అందులో అనేకమంది మహిళలు కూడా ఉన్నారని.., ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వెన్నుచూపకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని తన కథనంలో రాసుకొచ్చింది.
ఇటు…రైతుల సంఘాల నేతలు కూడా తమను ఎవరో… ఆదేశిస్తున్నట్లుగా… వెంటనే రంగంలోకి దిగిపోయారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్ గా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అటు టైమ్ మ్యాగజైన్ లో మహిళా రైతుల కవర్ పేజీతోపాటు ప్రత్యేక కథనాలు ప్రచురితం కావడం…! ఇటు రైతు సంఘాల నేతలు కూడా మహిళా దినోత్సవాన్ని… మహిళా కిసాన్ దివస్ గా నిర్వహించాలని పిలుపునివ్వడం…. ఇవన్నీ చూస్తుంటే…, మీకు ఏం డౌట్ రావడం లేదా? భారత్ లో జరుగుతున్న ఆందోళనలకు…అంతర్జాతీయంగా ఏదో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు కలగడం లేదా? భారతీయులారా మేల్కొనండి. ! ఒక్కసారి ఆలోచించడండి.!