National

యోగి బుల్డోజర్ల దెబ్బ అట్లుంటది మరీ..!

యూపీలో రెండోసారి సీఎం పదవిని చేపట్టిన యోగి.. రాష్ట్రంలో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు పాల్పడినా బుల్డోజర్లతో సమాధానం చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అల్లర్ల సూత్రధారులకు యోగి సర్కారు చుక్కలు చూపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం విధ్వంస ఘటనలు జరిగాయి.

ఈ ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను అధికారులు వరుసగా రెండో రోజూ ధ్వంసం చేశారు. శనివారం బుల్డోజర్లతో వెళ్లి నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు.. ఆదివారం కూడా ఆ పనిని కొనసాగించారు. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్ల సూత్రధారి అయిన జావేద్‌ అహ్మద్‌ అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. మే 10న నోటీసులు ఇచ్చామని, మే 24న సమాధానమిస్తానన్న జావేద్‌ స్పందించకపోవడంతో మే 25న కూల్చివేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జావేద్‌ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. షహరాన్‌పూర్‌లో ఇద్దరు నిందితుల అక్రమ నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు.

యూపీలో ఆందోళనకారులపై ఇద్దరు పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్న 30 సెకన్ల వీడియోను బీజేపీ ఎమ్మెల్యే, సీఎం యోగి మాజీ మీడియా సలహాదారు శలభ్‌ మణి త్రిపాఠీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దానికి ‘అల్లరిమూకలకు రిటర్న్‌ గిఫ్ట్‌’ అని శీర్షిక పెట్టారు. దీన్ని కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు స్వాగతించారు. ఇక జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆదివారం పోలీసులు వేలాది మంది ఆందోళనకారులపై 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఢిల్లీలోని జామా మసీదు వద్ద అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహ్మద్‌ నదీమ్‌, ఫహీంలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కాన్పూర్‌ హింస పథకం ప్రకారం జరిగిన కుట్రని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే ఆరోపించారు. కాగా, నూపుర్‌ శర్మ వివాదంలో తప్పుడు ప్రచారమంతా పాకిస్థాన్‌ సోషల్‌ మీడియా పననేని డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సెంటర్‌ పేర్కొంది.

మజ్లిస్‌ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు కలీముల్లా హఫీజ్‌తోపాటు అరెస్టు చేసిన 30 మంది పార్టీ కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలని అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. నూపుర్‌ శర్మ, జిందాల్‌లను అరెస్టు చేసే దమ్ము ఢిల్లీ పోలీసులకు లేదన్నారు. మరో వైపు కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అల్లర్లు చేస్తున్న వారిపై బుల్డోజర్లు, బుల్లెట్లతో అర్థం అవుతుందని బీజేపీ నేత సీటీ రవి వ్యాఖ్యానించారు. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, రాళ్లదాడి చేసిన వారికి బుల్డోజర్లు, బుల్లెట్లతో సమాధానం చెబితే వారికి అర్థమవుతుందని సీటీ రవి చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ నగర పరిధిలోని అటాలా ప్రాంతంలో అల్లర్ల నిందితుడు మహ్మద్ జావేద్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేసిన నేపథ్యంలో బీజేపీ నేత సీటీ రవి ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

15 − two =

Back to top button