More

    బెంగాల్ హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ఇప్పటి దాకా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

    ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్ చోటు చేసుకున్న హింస గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. భారతీయ జనతా పార్టీ మద్దతుదారులపై దాడులు, చంపేయడం, ఊళ్లను వదిలి వెళ్లిపోయేలా చేయడం, మహిళలపై అత్యాచారాలు.. ఇలా ఎన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో దారుణాలు జరుగుతున్నా కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. చూసి చూడనట్లు వ్యవహరించి టీఎంసీ గూండాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొని వచ్చారు.

    ప‌శ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన హింస‌పై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు ఓ అధికారి చెప్పారు. మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

    Related Stories