భూమా అఖిలప్రియ దంపతుల అరెస్ట్.. నివురుగప్పిన నిప్పులా నంద్యాల..!

0
358

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త బార్గవ్‌రామ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భూమా అఖిలప్రియ, ఆమె భర్తను నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దర్ని పోలీసులు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో మాజీమంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అడ్డుకోవాలని చూసిన ఆమె భర్త భార్గవ్‌రామ్‌, పీఏ మోహన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆధిపత్య పోరు కనిపించింది. నంద్యాల జిల్లాలో టీడీపీలోని అఖిలప్రియ వర్గం, సుబ్బారెడ్డి వర్గం సవాళ్లు విసురుకున్నాయి. టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్ఘణ నెలకొంది. నంద్యాల మండలం కొత్తపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. ఆ తర్వాత మాటా మాటా అనుకుని.. ఏకంగా గొడవకు దిగారు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియ అక్కడే ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ తన అనుచరులతో వెంబడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇరు వర్గాలు ఏ మాత్రం లెక్కచేయలేదు. ఏవీ సుబ్బారెడ్డిని ఆయన వర్గీయులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు అరగంట పాటు కొత్తపల్లి నడిరోడ్డు మీద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఏవీ సుబ్బారెడ్డిని కలిశారు.

ఒకప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. భూమా దంపతుల మరణం తరువాత ఏవీ సుబ్బారెడ్డి – అఖిలప్రియ మధ్య విభేదాలు తలెత్తాయి. రాజకీయంగా ఎదగాలని ఏవీ సుబ్బారెడ్డి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు.