ప్రముఖ దక్షిణాది నటిపై లైంగిక వేధింపులు.. స్నేహితుడి అరెస్ట్

0
856

ప్రముఖ దక్షిణాది నటిపై లైంగిక వేధింపులు నమోదయ్యాయి. ఆ నటి లైంగిక వేధింపుల ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను బయటపెడతానంటూ భవ్‌నిందర్ సింగ్ దత్‌ తనను వేధిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భవ్‌నిందర్‌ సింగ్‌ను అరెస్ట్ చేశారు. భవ్‌నిందర్ సింగ్ కుటుంబం, సదరు నటి కలిసి 2018లో ఓ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని భవ్‌నిందర్ తనను బెదిరిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్థికంగానూ అతడు తనను మోసం చేశాడని ఈ నెల 26న ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రొడక్షన్ కంపెనీ నుంచి తనను తొలగించి నకిలీ పత్రాలతో కంపెనీని సొంతం చేసుకున్నారని నటి ఆరోపిస్తోంది.