అయ్యో..! ఫాదర్..!!

– డా. భాస్కర యోగి
అయ్యో.. ఫాదర్ చచ్చిపోయాడని
అక్రమ సంతానమంతా అడ్డగోలుగా
వాదనకు దిగిందేమిటి..!?
“మరణాంతాని వైరాని” అని నమ్మిన వాళ్ళం కదా..
చచ్చాక మాకు శత్రువుతో కూడా వైరం లేదు నిజం..
ఏం..? నేరస్థులు వృద్ధులు కారా
వృద్ధులు నేరస్థులు కారా..!
అయినా ఎవడు చంపాడు..?
కర్మ ఫలం అందరికీ ఒక్కటే..
చావు ఎవరిదైనా కన్నీళ్లు కార్చాల్సిందే..
మరి..”ఎర్రబట్ట”నెత్తిన పెట్టుకొన్న వాళ్ళదే ప్రాణమా..
అక్రమంగా సాధ్విని పట్టుకెళ్ళి..
నవజీవాలను మింగ చూసినపుడు..
సెక్యులర్ తోడేళ్లకు
ఎర్ర నోళ్లకు ఎవడు తాళం వేశాడు..?
అంతెందుకు..! మొన్న”దీదీ” దాదా గిరీలో
వందల మంది నీ ఇంట్లోకి చొరబడి
“వస్త్రాపహరణం” చేస్తుంటే..
బొందలో పడుకున్నట్లు ఒక్కడూ నోరు తెరవలేదు
శ్మశానంలోకి తీసుకెళ్లి శవం దహనం చెద్దామంటే..
లేదూ కాదూ కూడదు.. అంటే ఇంట్లోనే పాతి పెట్టుకొన్నాం కదా
ఈ ఎర్రి ధృతరాష్ట్ర సంతతికి కనిపించ లేదా..?
ఫలానా పార్టీ కి ఓటు వేసావని..
నడి రోడ్డు మీద నరికి చంపుతుంటే..
మీ నరం లేని నాలుకలు నాటకంలా చూశాయి కదా..!?
ఇప్పటికే పాపాల పుట్టల్లో పాములను పెంచిన మీరు
నాగస్వరాలు ఊదడం.. ఆపి
ఈ దేశపు అత్మల ఆవేదన వినండి..
భీష్ముడి కన్నా వృద్దుడేం కాదుకదా
అధర్మం పక్కనుంటే.. అంతే..
ఫాదర్ అయినా మదర్ అయినా..
(ఎర్ర పక్ష పాతం చూసి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి. భాస్కర యోగి)