More

  ఓ భారతీయుడా ! ఒక్కసారి విను

  ఎవడైనా దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటే శకుని రా అంటుంటాం.. ఆ శకుని ఎక్కడివాడు అనుకున్నారు..! ఇదిగో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పుట్టిన వాడే..! హిందూ రాజులు ఎవరూ లేనట్టు..?? తాలిబన్లను చూపిస్తున్నారు..!! విదేశీ ముస్లిం దండయాత్రలకు గేట్ లాంటిది ఈ ప్రాంతం.. అదే ఒకప్పటి గందాహార్ ప్రాంతం..!

  మనకు తెలిసిన చరిత్రలో క్రీస్తు శకం 650 కి ముందు అక్కడ హిందువులు, ఆ తర్వాత బౌద్ధులు పాలించారు. అలాగే క్రీ. శ 650 నుండి క్రీ శ 870 వరకు సుమారు 270 సంవత్సరాలు ఆ ప్రాంతంలో హిందూ పాలనే సాగింది. తుర్కీలు,అరబ్బులు అటు వైపు ఖైబర్ వరకు తమ మతాన్ని విస్తరించారు. ఇక్కడి కాబూలు మీద కూడా వారి కన్ను పడింది. వాళ్లతో హోరాహోరి పోరు చేసిన హిందూ రాజులు ఎంతో మంది ఉన్నారు. రాజారణబలుడు, రాజా కమల వర్మ… క్రీస్తుశకం 921లో ఈ కమలవర్మ మరణం తర్వాత భీమ దేవుడు భారత సరిహద్దు గేటు దగ్గర నిరంతర యుద్ధం చేశాడు. ఈ భీమ దేవుడే భీమకోట గిరిదుర్గం నిర్మించాడు.

  అందుకే “గదా హస్త పరమ భట్టారక మహా రాజాధి రాజా రాజ పరమేశ్వర సాహిశ్రీ భీమ దేవా” అంటూ ఆయన సాహసాలను  ఓ సంస్కృత శాసనం వర్ణించింది.

  ఈ భీమ దేవుడి తర్వాత రాజాజయపాలుడు అనేక రాజనీతి వ్యూహాలకు ప్రదర్శించినా ధర్మంగా యుద్ధం చేయడం వల్ల, దురాక్రమణ దారుల కుటిలవ్యూహాల వల్ల గొప్ప సైన్యం కుప్పకూలింది. బౌద్ధుల నిష్క్రియాపరత్వం ఇచ వాళ్ల కొంపముంచింది. ఆ తర్వాత వచ్చిన ఆనందపాలుడు క్రీస్తుశకం 1005-06 లో గజిని మహమ్మద్ సైన్యాలను తన రాజ్యంలో అడ్డగించి గట్టిగా ఎదుర్కొన్నా ఓడిపోయాడు. అప్పుడే గజనీ రాజ్యంలో  తిరుగుబాటు  జరిగి

  గజినిమహమ్మద్ వెనక్కి వెళ్లినా..  ఆనందపాలుడి సోదరుడు సుఖపాలుడు వాళ్ల చేతుల్లో బంధీ గా ఉన్నాడు.  సుఖపాలుడి మతం మార్చి నవాజ్ షాన్ గా నామకరణం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి హైందవం స్వీకరించి తిరుగుబాటు చేసినా అనేక కారణాల వల్ల సుఖ పాళుడు జైల్లోనే మరణించాడు.

  క్రీస్తుశకం 1009 లో గజిని మహమ్మద్ మళ్లీ పెషావర్ పై దాడి చేస్తే ఆనంద పాలుడు అడ్డుకొన్నాడు.. ఆయనకు తోడుగా ఢిల్లీ , కనౌజ్,అజ్మీర్  రాజులు తమ సైన్యాన్ని పంపించారు. కానీ  ఆనంద పాలుడి దర్మయుద్దం కొంపముంచింది. 40 రోజులు స్తబ్దంగా ఉన్న గజనీ సైన్యం అర్ధరాత్రి కాపుకాసి.. అదను చూసి దెబ్బ కొట్టారు. ఆ తర్వాత చేసిన అరాచకాలుఅంతా ఇంతా కాదు. ఆనంద పాలుడు అవమాన భారంతో క్రీస్తుశకం1013 లో మరణించాడు. ఆ తర్వాత   త్రిలోచనపాలుడు ఆయన కొడుకు భీమపాలుడు కాశ్మీర్ లో గజనీ సైన్యానికి చుక్కలు చూపించారు. అప్పుడు  కాశ్మీర్ ను   పాలించే  సంగ్రామరాజా వారికి సహాయపడ్డాడు.వీరి పర్వత యుద్ద తంత్రాల గురించి రాజతరంగిణి గొప్పగా చెప్పింది.క్రీ శ 1015 లో గజిని లోహా కోట పై దాడి చేశాడు. ఈ లోహ కోట కాశ్మీర్ ముఖ ద్వారం.భీమ పాలుని ఎదురుదాడి వల్ల గజినీ సేనలు తోకముడిచాయి.
  ఇదంతా గత కాలం… గడిచిన కాలం..

  మరి ఇప్పుడు ఏం జరుగుతుంది..!?

  క్రీ శ1739 లో నాదిర్ష తో సంధి చేసుకొని మొఘల్ రాజులు భారత్ నుండి  ఆఫ్ఘనిస్తాన్ ను వేరు చేశారు.. 1747 లో ఆఫ్ఘనిస్తాన్ నుండి పూర్తిగా దూరమైంది. సా అవన్స్ వంశంలో మహమ్మద్ జహీర్ స 1973లో ఇటలీలో వైద్యానికి వెళ్తే అతడి కుర్చీని ప్రధాని దావూద్ ఖాన్ లాగేశాడు. ఆ తర్వాత వచ్చిన నూర్ మొహమ్మద్ తారీక్… రష్యా కీలుబొమ్మ గా మారిపోయాడు. అతని విదేశీమంత్రి హఫీజ్ అమెరికా పాటకు డాన్స్ చేశాడు. రష్యా అమెరికాల బంతాట లో తాలిబన్ల సృష్టి జరిగిపోయింది. వాళ్లు 1996 నుండి 2001 వరకు అద్భుత పాలనను ప్రపంచానికి చూపించారు. బమియాన్ బుద్ధ విగ్రహాల విధ్వంసం.. ఆడవాళ్ళను లాక్కెళ్లి తీసుకు పోవడం.. కాఫీర్లనుచిత్రహింసలు పెట్టడం.. వగైరా వగైరా..

  మళ్లీ ఇప్పుడు అదే రాజ్యం వచ్చింది.. తుపాకులు చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. తమ రాజ్యం వచ్చిందంటూ వివిధ దేశాల్లోని మతోన్మాదులు మురిసిపోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ తాలిబాన్ రాజ్యం మనకు ఎంతో దూరంలో లేదు. మన కశ్మీర్ కు కేవలం 400వందల కిలోమీటర్ల దూరమే..!?

  మనం సంపాదిస్తున్న ఆస్తులు.. నిర్వహిస్తోన్న వ్యాపారాలు ఉద్యోగాలు.. ఇలాంటి తుపాకీ గాళ్ళు మన మధ్య లోకి వస్తే మనం మిగులుతామా..?

  మనం చదువుకున్న చదువులు.. మన సో కాల్డ్ వైట్ కాలర్ మనస్తత్వం వీళ్ళ బజురురుగడ్డాల ముందు ఆగుతుందా..?

  నలుగురు తాజ్ హోటల్ లో తుపాకులు పట్టుకుని దూరి వందల మందిని హత్య చేస్తే ఏం చేశాం..?!

  మరో నలుగురు పట్టపగలే పార్లమెంటుపై దాడి చేస్తే ఏం చేయగలిగాం..?

  అంతెందుకు..!? 1999 లో IC814 విమానం హైజాగ్ చేసి అమృత్సర్… నేపాల్… కాందహార్ తిప్పి ముస్తాక్ అహెమద్..మౌలానా మసూద్ అజర్… ఉమర్ షేక్ వంటి కరడు గట్టిన తీవ్ర వాదులను అప్పగించమని డిమాండ్ చేస్తే అప్పగించాం కదా!

  అమెరికా రష్యా లో ఇంటికి పారిపోతే మనం…?! వాళ్ల మాదక ద్రవ్యాలు..మనదేశంలోకి చొర బడ్డాయి కదా!?
  ఇప్పుడేదో వాళ్లు బుద్ధిమంతులు అయినట్టు.. వాళ్ళు తపస్సు చేస్తే గడ్డాలు మొలచినట్టు.. మన సోకాల్డ్ మీడియా వల్లిస్తుంటే నిజం  అని నమ్మేరు సుమా… తస్మాత్ జాగ్రత్త..!

  (తాలిబాన్ల చరిత్రను వారి వెనుక ఉన్న సిద్ధాంతాన్ని భారతదేశం అర్థం చేసుకుంటే మనం మరో ప్రమాదంలో పడ్డట్టే అని హెచ్చరిస్తూ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కరయోగి వ్యాసం)

  Trending Stories

  Related Stories