Right Angle

భారత్ లో వ్యాక్సినేషన్.. వాస్తవ గణాంకాలివిగో..!

కరోనా సెకండ్ వేవ్ యావత్ భారతదేశాన్ని వణికిస్తోంది. ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయడం వల్లే వేగంగా వ్యాపిస్తున్న కరోనాకు చరమగీతం పాడడం సాధ్యమని నిపుణులుచెప్తున్నారు. ఈనేపథ్యంలో మన ప్రసార మాధ్యమాలు వాక్సిన్ కొరత గురించి తెగ ఆయాసపడుతున్నా యి. అసలు మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏస్థాయిలో జరుగుతోంది..? ప్రపంచదేశాల గణాంకాలతో పోల్చితే మనం ఎక్కడున్నాం..? వాక్సిన్ కొరతకు కారణాలేంటి..? మనదేశంలో వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత..? అగ్రరాజ్యాలు ఉత్పత్తి చేస్తున్నదెంత..? తెలిపే ప్రయత్నం చేస్తాను. అంతర్జాతీయ మాధ్యమాలు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ఆధారంగా నేనే ఈ వివరాలు చెప్తున్నాను. ఈ ఆధారాల్లో.. లేదా నేను చెప్పేఅంశాల్లో ఏదన్న తప్పు ఉంటే విమర్శలు చేయండి.. అంతేగానీ ఊరికే ఎదో మోడీ మీడియా అనీ.. బీజేపీ ఛానల్ అనీ పనికిమాలిన కామెంట్లుపెట్టేవారు.. జస్ట్ shut up..!

సో ముందుగా.. మనదేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఏ స్థాయిలో జరుగుతోంది..? ప్రపంచ దేశాలతో పోల్చితే మనంఎక్కడున్నామో చూద్దాం. గత నెల రోజులుగా మన విపక్షనాయకులూ.. పాత్రికేయ మిత్రులు చేస్తున్న అసత్య ప్రచారం ఏంటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు అక్కడి ప్రజలకు వేగంగావాక్సినేషన్ చేస్తున్నాయి. మనదేశంలో మోడీ విఫలమయ్యాడు అని. మోడీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాడు.. కానీ, ఆయా దేశాల్లో వాక్సినేషన్ అద్భుతంగా జరుగుతోంది అని విమర్శిస్తున్నారు. ఇది వాస్తవమా..? ఒకసారి చూద్దాం.

అంతర్జాతీయ ప్రసార మాధ్యమం bloomberg ప్రపంచ దేశాల వాక్సినేషన్ ప్రక్రియపై రియల్ టైమ్ డేటాని అందుబాటులోకి తెచ్చింది. ఆ డేటా ప్రకారం.. మే 12 వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 134 కోట్ల మంది వాక్సిన్ వేయించుకున్నారు. వాక్సినేషన్ జరుగుతున్న దేశాల జాబితాలో చైనా 33 కోట్ల 29 లక్షలపైచిలుకు ప్రజలకు వాక్సిన్లు వేసి అగ్రస్థానంలోనిలిచింది. 26 కోట్ల 31 లక్షలమందికి వాక్సినేషన్ చేసిన అమెరికా రెండోస్థానంలో ఉంది. యూరోపియన్ దేశాల కూటమి మొత్తం 17 కోట్ల 90 లక్షల డోసుల వాక్సినేషన్ తో మూడోస్థానంలో ఉంటే.. ఆ యూరోపియన్ యూనియన్ కి దాదాపు సరిసమానంగా 17 కోట్ల 51 లక్షల మందికి వాక్సినేషన్ చేసిన దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు 12వ తేదీ వరకు అప్ డేట్ చేసినవి. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెబ్ సైట్లో పొందుపరిచిన డేటా ప్రకారం మే 13వ తేదీ నాటికి 17 కోట్ల 72 లక్షల 14 వేల 256 మందికి భారత ప్రభుత్వం వాక్సిన్ వేయడం జరిగింది. ఈ గణాంకాలను వక్రీకరించి.. మన శ్మశాన పాత్రికేయులు ప్రపంచదేశాలతో భారత్ ను పోలుస్తూ.. ఆయాదేశాల్లో జనాభా ఆధారంగా మొత్తం వాక్సినేషన్ శాతాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆయా దేశాలు రోజుకు సగటున ఎన్ని డోసులు వేస్తున్నాయి.. ఇప్పటిదాకా ఎంతమందికి వాక్సినేషన్ జరిగింది అన్నవిషయాన్ని చెప్పకుండా తెలివిగా తమ ద్వంద్వ నీతిని చాటుకుంటున్నారు.

వాస్తవాలు ఇలా ఉన్నాయి. bloomberg డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా వాక్సినేషనేషన్ చేసిన దేశాల జాబితాలో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే చైనా, అమెరికాల తర్వాత స్థానాల్లోభారత్ నిలిచింది. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రెజిల్ 5 కోట్ల 47 లక్షలమందికి.. యూకే సుమారు 5 కోట్ల 36 లక్షలమందికి.. జర్మనీ 3 కోట్ల 57 లక్షల మందికి.. ఫ్రాన్స్ 2 కోట్ల 67 లక్షల మందికి.. ఇటలీ 2 కోట్ల 48 లక్షల మందికి వాక్సినేషన్ చేశాయి. అటు రష్యా, కెనడా, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు.. కనీసం 2 కోట్ల వాక్సినేషన్ మార్క్ ను కూడాదాటలేదు. bloomberg వాక్సిన్ ట్రాకర్ జాబితాలో.. అత్యధికంగా వాక్సినేషన్ చేసిన దేశాలుగా చైనా మొదటిస్థానంలో.. అమెరికా రెండోస్థానంలో నిలిస్తే.. యూరోపియన్ యూనియన్, భారత్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో బ్రెజిల్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. ఈ నాలుగు దేశాలు ఇప్పటి వరకు వేసిన మొత్తం డోసుల సంఖ్య భారతం లో జరిగిన వాక్సినేషన్ కన్నాతక్కువే. ఇవేవీ మన కుహనా పాత్రికేయులకు పట్టవు. భారత్ లో వాక్సినేషన్ పై అసత్య ప్రచారాలు చేసేవారు తెలివిగా జనాభా నిష్పత్తిని చూపిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. అంతేకాదు.. మనదేశంలోవాక్సిన్ల కొరత విపరీతంగా ఉందనీ.. అందరికి వాక్సిన్ అందుబాటులో లేదని విమర్శించేవారూ ఉన్నారు. నిజమే మన దేశ జనాభాకు తగ్గట్టు ఒకేసారి వాక్సిన్ ఇప్పించే పరిస్థితి ప్రస్తుతానికి లేద.. కానీ, అగ్ర రాజ్యాలు రోజు వేస్తున్న వాక్సిన్ల సగటుని ఒకసారి పరిశీలిస్తే మనకు ఈవిషయంలో క్లారిటీ వస్తుంది.

bloomberg డేటా ప్రకారమే.. అగ్రరాజ్యమైన అమెరికా రోజుకు 21 లక్షల 97 వేల 491 మందికి వాక్సిన్ వేస్తుంటే ఆ దేశంతో దాదాపు సమానంగా 21 లక్షల 7 వేల 625 మందికి భారతదేశం వాక్సినేషన్ చేస్తోంది. ప్రతి రోజూ అమెరికాలో వేస్తున్న వాక్సిన్లకు దాదాపు సమానంగా భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని ఈ గణాంకాలే చెప్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం.. చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్ లు రోజుకు 20 లక్షలకు పైగా డోసుల వాక్సిన్లు వేస్తుంటే.. మిగతా దేశాలేవీ రోజుకు కనీసం 10 లక్షల డోసుల వాక్సిన్లు కూడా వేయట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
కానీ, భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ విఫలమైందని.. మోడీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడని మన పత్రికల్లో కుహనా జర్నలిస్టులు ఊదరగొడతారు.. అంతర్జాతీయ పత్రికలూ భారత్ పై అసత్య ప్రచారాలు చేస్తాయి. మోడీ దిగిపోవాలని అదేపనిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు.. అసత్య ప్రచారానికి అసలుకారణం వేరే ఉంది. అది వైట్ సుప్రిమసి. ఎస్ 70 ఏళ్లుగా ప్రతి చిన్న విషయానికి ప్రపంచదేశాల ముందు నిస్సహాయస్థితిలో నిలుస్తూ వారి సాయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన భారతదేశం ఇంత విపత్కరమైన కరోనని సులువుగా జయించడం పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. ఆ ఫలితమే ఈ శ్మశాన పాత్రికేయుల పైశాచికానందం.

కరోనా విలయతాండవం ముందు అమెరికా దిక్కుతోచనిస్థితిలో సంవత్సరం పాటు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. ఆ కల్లోల పరిస్థితి నుంచి బయటపడి గతేడాది చివర్ వాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. అగ్రరాజ్యంతో సరిసమానంగా వాక్సినేషన్ ప్రక్రియను భారత్ కూడా మొదలుపెట్టింది. ఇదే ఈరోజు ఇంత గందరగోళానికి కారణం. దానికి ఆధారాలు లేకపోలేదు. డిసెంబర్ రెండోవారంలో అమెరికాలో వాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. సరిగ్గా నెలరోజుల వ్యవధిలోనే భారత్ లో కూడావాక్సినేషన్ మొదలైంది. అప్పటికి ఇంకా అమెరికాలో పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో దేశములో కరోనా ఇంకా కంట్రోల్లోకి రాని పరిస్థితి. సరిగ్గా జనవరి 24వ తేదీన అమెరికాలో అత్యధికంగా 90 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో వాక్సిన్లను ముందు అమెరికన్లకు వినియోగించాకే ఇతర దేశాలకు పంపాలని బైడెన్ నిర్ణయించారు. ఇంతవరకు బానే ఉంది.. కానీ, ఇతర దేశాల్లోవాక్సిన్ తయారీకి కావలసిన ముడి సరుకు ఎగుమతి నినిలిపివేస్తూ ఫిబ్రవరి చివరివారంలో నిర్ణయించడంతో వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం మిగతా దేశాలతో పోల్చితే భారత్ పై అధికంగా పడింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈవాక్సిన్ కొరతకు అమెరికా ఆంక్షలు కూడా ఒక రకంగా కారణమే. ఈ ఆంక్షల్ని ఎత్తివేయాలని సుమారు రెండు నెలల పాటు భారత ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా అమెరికా అంగీకరించలేదు. రెండు నెలల తర్వాత.. భారత్ లో సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. వాక్సిన్ ఉత్పత్తి దారులు.. భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి మేరకు.. ఏప్రిల్ చివరివారంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ రెండు నెలల వ్యవధిలో భారత లో వాక్సిన్ ఉత్పత్తి మందగిస్తూ రావడంమూలంగా ఈ రోజు మనం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వాక్సినేషన్ చేయలేకపోతున్నాం. అమెరికా ఎగుమతుల నిలిపివేత వల్ల కలిగిన నష్టం గురించి ఏ మాత్రం వ్యాఖ్యానించని మన పాత్రికేయులు.. ఆంక్షలు సడలించగానే పెద్దన్న సాయం అని బైడెన్ ను ప్రశంసిస్తూ హెడ్డింగులు పెట్టడం విషాదకరం.

ప్రస్తుతం మనదేశంలో వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం గురించి తెలుసుకుందాం. భారత్ లో రెండు వాక్సిన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. ఒకటి భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్.. రెండోది సీరం ఇనిస్టిట్యూట్ – oxford astrazeneca సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషిల్డ్. భారత్ బయోటెక్ ప్రస్తుతం సుమారు రోజుకు 4 లక్షల 16 వేల డోసుల్ని.. నెలకు సుమారు కోటి 25 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సురక్షా మిషన్ ద్వారా కేంద్రం ఈ ఉత్పత్తిని పెంచడానికి కార్యాచరణ రూపొందించింది. నెలరోజుల్లో ప్రస్తుతం ఉన్న సంఖ్యకు రెట్టింపు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్పత్తి వేగం ఉపందుకుంటే జులై – ఆగష్టు నెలలో సుమారు 7 కోట్ల డోసులు.. సెప్టెంబర్ చివరికల్లా 10 కోట్లకొ వాక్సిన్ డోసులు ఉత్పత్తి జరుగనుంది. ఇక మరోవైపు సీరం ఇనిస్టిట్యూట్ రోజుకి సుమారు 16 నుంచి 20 లక్షలడోసులతో.. నెలకు సుమారు 5-6 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఉత్పత్తి సామర్త్యాన్ని మరింత పెంచే విధంగా మరిన్ని ప్లాంట్లు విస్తరించనున్నట్టు ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ adar punavala ప్రకటించారు. జులై చివరికల్లా నెలకు సుమారు 33 నుంచి 40 లక్షల కోవిషీల్డ్ డోసుల్ని భారత ప్రజలకు అందించనున్నట్లు అయన హామీ ఇచ్చారు. ఇవేకాకుండా జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి ఆ సంస్థతో బయోలాజికల్ ఈ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అటు రష్యా వాక్సిన్ స్పుత్నిక్ వి తో హెటేరో, డా. రెడ్డీస్ లాబరేటరీలు ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా మనదేశంలో ప్రస్తుతం నెలకు 70 నుంచి 80 మిల్లియన్ల డోసుల కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతుంది. చైనా, అమెరికాల తర్వాత అంత పెద్దమొత్తంలో వాక్సిన్లు ఉత్పత్తి చేసే దేశం భారత్ మాత్రమే. అగ్రదేశాలతో పోటీపడుతూ ఎప్పటికపుడు పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ రావడం వల్లనే భారత్ ఈ స్థాయికి చేరుకుంది. ఇది మోడీ పట్టుదల వలనా కాదా..? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.

మొదట్లో వాక్సిన్ల పట్ల అపోహలు సృష్టించిన మన నాయకులూ ఇప్పుడు వాక్సిన్ల కొరత గురించి ప్రచారం చేయడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం కాదా..? ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్లే ఇపుడు వాక్సిన్ల కొరత ఉందని మరో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో ఈరోజు వాక్సిన్లపై అపోహలు సృష్టించి.. 20 శాతం దాకా వాక్సిన్ wastageకి కారణమయింది ఈనాయకులే. వాక్సిన్ తప్పనిసరిగా వేయించుకునేలా ప్రజల్ని ప్రోత్సహించకపోగా.. లేనిపోని భయాల్ని ప్రోదిచేయడం వల్ల మనదేశంలో మొదటి రెండు నెలల్లో వాక్సినేషన్ అంతంతమాత్రంగా నేసాగింది. దీంతో డిమాండ్ ను అంచనా వేస్తూ భారత ప్రభుత్వం పేదదేశాల్లోని కోవిడ్ వారియర్స్ కి వాక్సిన్లను ఎగుమతి చేసి పెద్ద మనసు చాటుకుంది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని గొంతు చించుకునే మన కమ్యూనిస్టులకు ఇప్పుడు చిన్నదేశాల్లోని అవసరార్థులకు సాయం చేయడం నేరంగా తోస్తోంది. చైనా చైర్మన్ మా చైర్మన్ అని ప్రకటించిన ఎర్ర విశ్లేషకులు ఇప్పుడు అమెరికా ఫస్ట్ అన్న బైడెన్ విధానాన్ని కీర్తించడం విడ్డూరంకాక మరేంటి..! ఒకరకంగా చెప్పాలంటే మనదేశంలోలాగా శవ రాజకీయాలు చేసే నాయకులు. ఆత్మాభిమానాన్ని అమ్ముకునే పాత్రికేయులు.. దేశాన్ని కించపరుస్తూ పైశాచికానందం పొందే కుహనావాదులు ఎక్కువగా లేకపోవడం ఆ అగ్రరాజ్యాల అదృష్టం.. మన దురదృష్టం.

సో ఫ్రెండ్స్.. ఈ అసత్య ప్రచారాలు నమ్మకండి.. దేశంలోని ప్రతి ఒక్కరికి వాక్సిన్ చేయించే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికాల తర్వాత ఆ స్థాయిలో వాక్సిన్లు వేసిన ఘనత మన దేశానికే దక్కుతుంది. అమెరికాలో డిసెంబర్ నెలలో వాక్సినేషన్ ప్రక్రియ మొదలైతే ఇప్పటికి 41 శాతానికి చేరుకోగలిగింది. కానీ, అమెరికా కన్నా మన దేశ జనాభా సుమారు 100 కోట్లుఅధికం. వారితో సరిసమానంగా మన దేశంలో కూడా వాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ.. మన దేశం మొత్తం వాక్సినేషన్ జరగాలంటే కొంచెం సమయంపడుతుంది అన్న విషయాన్ని గురించాలి. అంతేగాని ఈ చెత్త ప్రచారాలు నమ్మి క్యూలైన్లలో నిలబడి అనవసరంగా కరోనాని కొనితెచ్చుకోవద్దు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం మన పేరుని నమోదు చేసుకుని.. మనకు అవకాశం వచ్చినపుడు వెళ్లి వాక్సినేషన్ చేయించుకుందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 − 2 =

Back to top button