National

భారీగా తగ్గేస్తున్న కరోనా కేసులు.. భారత్ బయోటెక్ నుండి నాసల్ స్ప్రే

భారతదేశంలో గత 24 గంటల్లో 3.21 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా 5,379 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 27 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 50,594 గా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.70 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,13,91,49,934 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

ఇక దేశంలో కరోనా మహమ్మారితో పోరాడడానికి నాసల్ స్ప్రే కూడా వచ్చేసింది. భారత్ బయోటెక్ కు చెందిన నాసల్ వ్యాక్సిన్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని.. 18 ఏళ్లు పైబడిన వారిలో కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రాథమిక రోగనిరోధకత కోసం CDSCO ద్వారా వ్యాక్సిన్ ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ సంస్థ ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పటిదాకా 4 వేల మంది వలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వగా, ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి ఈ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయి.

Related Articles

Back to top button