Telugu States

ఇంకా నాటు వైద్యం మాయలో.. శిశువు బొడ్డు చుట్టూ కొరికించడంతో

మూఢనమ్మకాలు.. నాటు వైద్యం మాయలో పడి ఆ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డ ప్రాణాలు పోయేలా చేసుకున్నారు. రెండు నెలల బాలుడిని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లకుండా.. నాటు వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయితే ఆ నాటు వైద్యుడు పిల్లాడి కడుపు చుట్టూ కొరికి తగ్గిపోతుంది వెళ్ళమని అన్నాడు. అతడు చెప్పిందే నిజమవుతుందని నమ్మిన తల్లిదండ్రులు ఇప్పుడు తీరని దుఃఖంలో ఉన్నారు.

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు వలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం ఓ బాబు జన్మించాడు. సోమవారం రాత్రి కడుపునొప్పి రావడంతో ఆ చిన్నారి ఏడుపు ప్రారంభించాడు. ఆ కడుపునొప్పి తగ్గించడానికి తల్లిదండ్రులు మూఢ నమ్మకాల వైపు మొగ్గు చూపారు. బాబును తీసుకొని గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సంప్రదించాడు. అతడు ఆ బాబు బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. నొప్పితో చిన్నారి మరింత ఏడవడంతో పసరుమందు సైతం పోశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త చిన్నారిని గుర్తించి వెంటనే కరకగూడెం పీహెచ్‌సీకి తరలించింది. పరిస్థితి విషమించడంతో వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా భద్రాచలం ఆసుపత్రికి పంపించారు. అక్క‌డ వైద్యులు ప‌రిశీలించ‌గా శిశువు క‌డుపులో చిన్న పేగు తెగిన‌ట్లు తేలింది. బొడ్డు చుట్టూ బ‌లంగా కొర‌క‌డంతో చిన్న‌పేగు తెగిపోయింద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. చికిత్సపొందుతూ పసికందు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు.

image.png

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 16 =

Back to top button