More

    కబ్జా కోరల్లో భద్రాద్రి రామయ్య భూములు రంగంలోకి విశ్వ హిందూ పరిషత్

    భద్రాద్రి కొత్తగూడెం : గత కొంతకాలంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ భూముల కబ్జాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆలయ భూముల కబ్జాల పర్వం… శ్రుతి మించి ఆలయ అధికారులపై దాడులకు సైతం పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రాలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తమ పట్నం గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ భూములు… సుమారు 917 ఎకరాలు ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పురుషోత్తమపట్నం గ్రామస్థులు స్వామివారి ఆలయ భూముల్ని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఆలయ అధికారులకు శిస్తు, కౌలు కడుతూ వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ సిస్తులు కూడా చెల్లించకుండా క్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కబ్జా పర్వానికి తెర లేపారు.

    దీనితో ఇటు ఆలయ అధికారులకు,పురుషోత్తమపట్నం రైతులకు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామి వారి ఆలయభూములను కబ్జా చేస్తున్న సంగతి తెలుసుకున్న ఆదివాసీలు… పురుషోత్తమపట్నం గ్రామస్థులకు ఎటువంటి హక్కులు లేవని, ఉంటే ఆదివాసీ గిరిజనప్రజలకు మాత్రమే ఇక్కడ గిరిజన చట్టాల ప్రకారం తమకే భూములు చెందుతాయని ఆదివాసీలు ఆందోళన చేస్తూ తాజాగా తెరమీదకు వచ్చారు.

    ఇలా ఒకరి తర్వాత ఒకరు స్వామి వారి ఆలయ భూములను స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారని… విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర రెడ్డి తెలుసుకున్నారు. ఆంధ్రాలో ఉన్న రామయ్య భూములలో ఒక్క సెంటు భూమి కూడా కబ్జా కాకుండా కాపాడుతామని,రామయ్య భూములను పరిరక్షిస్తామని,ఉద్యమాన్ని గోపూజతో దైవకార్యంగా భావించి ప్రారంభిస్తున్నామన్నారు. రామయ్య భూములను కాపాడవలసిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల
    ప్రజలకు ఉందన్న ఆయన.. రామయ్య భూములను రామయ్యకు తిరిగి అప్పగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

    Trending Stories

    Related Stories