More

    గోదావరికి నదీ హారతులు

    భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి మాతకు వైభవంగా నదీ హారతులు సమర్పించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ ఫుణ్యాహవాచన నిర్వహించారు. గోదావరి మాతకు అష్టోత్తర శత నామార్చనలు జరిపారు. అనంతరం గోదావరి మాతకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమలు, గాజులు, పూలు, పండ్లు సమర్పించారు. హిందూ సంప్రదాయంలో నదులను పూజించడం, పంచభూతాలను ఆరాధించడం ఎప్పటి నుంచో ఉంది. పులిహోరను గోదావరి మాతకు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories