More

    దుర్గా పూజా మండపంలో అగ్నిప్రమాదం.. అయిదుగురు మృతి

    ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు మరణించారని భదోహి డీఎం గౌరంగ్ రాఠీ తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హారతి నిర్వహిస్తుండగా పూజా పండులో మంటలు చెలరేగడంతో 60 మందికి పైగా గాయపడ్డారు.

    దుర్గామాత మండపంలో పూజలు చేస్తున్న సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్‌ గౌరంగ్‌ రాఠీ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు డీఎంతోపాటు జిల్లాకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తొమ్మిది మందిని స్థానిక ఆసుపత్రిలో చేర్చగా, మరో 33 మంది తీవ్రంగా కాలిన గాయాలతో సమీపంలోని వారణాసిలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు.

    Trending Stories

    Related Stories