కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన గ్యాంగ్ రేప్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నలుగురు కామాంధులు, ఓ మహిళ కలిసి బాధితురాలిపై చేసిన ఈ ఆకృత్యం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. బాధితురాలు మొదట బాధితురాలిని నాగాలాండ్ కు చెందిన 25 ఏళ్ల లోవి సుమిగా భావించారు. ఆమె ఇటీవల రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఆత్మహత్యకు పాల్పండింది. అయితే, మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆమె కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వైరల్ వీడియోను అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపించారు. మొదట ఆ వీడియోను చూసిన అస్సాం పోలీసులు.. అది తమ రాష్ట్రంలోనే జరిగినట్లు పొరపడ్డారు. నిందితుల ఫొటోలను తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి, నిందితుల ఆచూకీ చెబితే బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు.
అయితే, వీడియో ఫార్వార్డులను ట్రేస్ చేసిన పోలీసులు చివరికి ఆ ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో జరిగినట్టు గుర్తించారు. దీంతో అలర్టయిన బెంగళూరు పోలీసులు.. స్పెషల్ టీమ్స్ ను నియమించి దర్యాప్తును వేగవంతం చేసింది. చివరికి రామమూర్తి నగర్ లోని ఓ రెంటెడ్ హౌజ్ లో ఓ మహిళతో పాటు.. ఐదురుగు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ బాబా షేక్, రిదోయ్ బాబో, సాగర్, హకీల్ గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రూప్ కు చెందినవారని.. అందరూ బంగ్లాదేశీ అక్రమ వలసదారులని పోలీసులు తెలిపారు. ఇక, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు స్పాట్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ టైమ్ లో ఇద్దరు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, వారి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి, ట్రీట్ మెంట్ అందించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ కే చెందిన బాధితురాలు.. ఇంట్లో చెప్పకుండా భారత్ కు పారిపోయి వచ్చినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన నిందితుల పంచన చేరినట్టు సమాచారం. ఇక, తాము అద్దెకుంటున్న ఇంట్లోనే నిందితులు వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో పలువురు యువతులతో వ్యభిచారం చేయించేవారని తేలింది. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో బాధిత మహిళకు, నిందితులకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో తమ గ్యాంగ్ లోని ఓ మహిళ సహకారంతో ఆమెను అతి దారుణంగా హింసించి గ్యాంప్ రేప్ కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మంచానికి కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి మర్మావయవంలో మద్యం సీసాతో అతికితకంగా దాడిచేసి రాక్షసానందం పొందారు.
ఇక, ఈ ఘన జరిగిన తర్వాత బాధిత మహిళ నిందితుల వద్ద నుంచి తప్పించుకుని కేరళలోని కోజికోడ్‌కు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఆమెకు పరిచయం ఉన్న మహిళ వద్ద ఆశ్రయం పొందినట్టుగా తెలుసుకున్నారు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపించి.. ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిందితులను దోషులుగా గుర్తించి శిక్షలు ఖారారు చేసే అవకాశం వుంది.
ఇదిలావుంటే, గ్యాంగ్ రేప్ ఘటనపై కర్నాటక సీఎం యెడియూరప్ప స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ ఘటన వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ హస్తం ఉందని, ఇందులోని మరికొంత మంది కేరళలో ఉన్నట్లు నిందితులు విచారణలో తెలిపారని హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అక్రమ వలసదారులు.. దేశ సరిహద్దులు దాటేసి, ఇలా దర్జాగా ఒక మహానగరంలో తిష్ట వేసిన వైనం చూస్తే.. ఈ లెక్కన దేశంలో ని మహానగరాల్లో ఇలా అనుమతి లేని వారెందరన్న సందేహాం రాక మానదు.ఇటీవలికాలంలో దేశంలోకి ఇలాంటి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశీయులు అక్రమ మార్గంలో దేశంలోకి చొరబడి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు గ్యాంగ్ రేప్ ఘటన.. CAA, NRC చట్టాల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది. దేశంలో ఉన్నఫళంగా ఈ చట్టాలను ను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక చట్టాల వల్ల పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాల్లో హింసకు గురై, మన దేశానికి చేరుకుంటున్న మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడమే కాకుండా.. ఇలాంటి ముష్కరమూకలను కూకటివేళ్లతో ఏరిపారేసే వెసులుబాటు దక్కుతుంది. యాధృచ్చికమైన విషయం ఏమిటంటే.. తాజాగా కేంద్ర హోంశాఖ CAA అమలకు శ్రీకారం చుట్టింది. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీల నుంచి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం.
CAA గానీ, NRC గానీ దేశ భద్రతను మరింత శత్రదుర్బేధ్యంగా మార్చే చట్టాలు. కానీ, కాసుల కక్కుర్తికోసం కొన్ని పెంపుడు జాతి జంతువులు,.. అక్రమ వలసదారులకు బాకాలూదే విదేశీ ప్రేరేపిత మీడియా, కుహనా లౌకికవాదులు.. ఈ ప్రతిష్టాత్మక చట్టాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వారి ఆటలు సాగకుండా మోదీ ప్రభుత్వం ఈ రెండు చట్టాలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇవాళ బంగ్లాదేశీ అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడ్డారు. రేపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అక్రమార్కులు కూడా నేరాలకు పాల్పడవచ్చు. మరి, వీళ్లు శిక్షలు విధించి.. శిక్షాకాలం పూర్తికాగానే వదిలేస్తే సరిపోతుందా..? ఈ నేరాలకు మూలమైన అక్రమ వలసలను అరికట్టడమే అసలైన పరిష్కారం. అది జరగాలంటే దేశంలో CAA, NRC వంటి చట్టాలు పకడ్బందీగా అమలు కావాల్సిన అవసరం కచ్చితంగా వుంది.