National

లాక్ డౌన్ అంటే చాలు.. వెస్ట్ బెంగాల్ లో కూడా అదే పరిస్థితి

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఎన్నో రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ను ప్రకటించగానే మందుబాబులు మద్యం దొరుకుతుందో లేదో అనే భయంతో లిక్కర్ షాపుల ముందు పరిగెత్తుతూ ఉంటారు. ఇటీవల తెలంగాణలో లాక్ డౌన్ ను అమలు చేసినప్పుడు చోటు చేసుకున్న ఘటనలను దేశం అవాక్కయ్యి మరీ చూసింది. చాలా వరకూ స్టాక్ ను నిమిషాల్లో ఖాలీ చేసేశారు. ఎక్కువ స్టాక్ ను తెచ్చిపెట్టుకోమని చెప్పే ప్రభుత్వాలు.. వైన్ షాపు ముందు కరోనాను కట్టడి చేసే చర్యలు మాత్రం తీసుకోలేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయలేకపోయారని ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన మమతా బెనర్జీ సర్కారు శనివారం నాడు లిక్కర్ షాపుల ముందు ప్రజలను కట్టడి చేయడానికి కనీస చర్యలు తీసుకోలేదు.
కోవిడ్ కేసుల పెరుగుదలను కట్టడి చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం నాడు అత్యధికంగా 20,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం అదనపు ఆంక్షలను ప్రకటించింది. పరిశ్రమలు, అంతరాష్ట్ర రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్ల వంటి అన్ని సేవలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మతపరమైన సమావేశాలతో సహా అన్ని రకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించింది.అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం ఏడు నుంచి 10 గంటల వరకు 3 గంటల పాటూ దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో చెప్పడంతో కోల్ కతా లోని ఎన్నో ప్రాంతాల్లో లిక్కర్ కోసం ప్రజలు క్యూ కట్టారు.
లాక్ డౌన్ సమయంలో లిక్కర్ షాపులు మూసివేస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోల్ కతా నగరంతో పాటూ.. ఇతర ప్రాంతాల్లోని లిక్కర్ షాపులకు ప్రజలు క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. మాస్కులు లేకుండా.. సామాజిక దూరం అన్నది పాటించకుండా ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven + eighteen =

Back to top button